vyjayanthi
-
వైజయంతి... ఒక యుద్ధం!
పవర్ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా ‘కర్తవ్యం’ (1990)లో విజయశాంతి నటనను అంత సులువుగా మరచిపోలేం. లేడీ అమితాబ్ అనిపించుకున్న ఈ యాక్షన్ స్టార్ మళ్లీ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనే వైజయంతి పాత్రలో కనిపించనున్నారు విజయశాంతి. సోమవారం (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె లుక్, క్యారెక్టర్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. చీరకట్టులో హుందాగా, ఖాకీ దుస్తుల్లో పవర్‌ఫుల్‌గా విజయశాంతి కనిపించగా, ‘వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫామ్‌కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...’ అంటూ ఆమె పాత్ర గురించి కల్యాణ్ రామ్ తన వాయిస్ ఓవర్‌తో ఆ వీడియోలో వివరించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. -
ఒసేయ్ రాములమ్మా 2
విజయశాంతి లీడ్ రోల్లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మా’. 1997లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే అదే పేరుతో మరో సినిమా రానుంది. కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్ రాములమ్మా 2’ స్క్రిప్ట్ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు. -
నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి
1979లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శంకరాభరణం సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఒకరోజు అకస్మాత్తుగా వర్షం రావటంతో పక్కనే ఉన్న అప్సర హోటల్‌కి అందరం చేరుకుని, అందరం కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో, చంద్రమోహన్, ‘జిత్‌మోహన్ పాటలు పాడతాడు’ అని జంధ్యాలకు చెప్పారు. వెంటనే జంధ్యాల నన్ను పాడమన్నారు. నేను ‘హమ్ కాలే హై తో క్యా దిల్ వాలే హై’ అనే పాట పాడాను. ఆ తరవాత చాలా పాటలు పాడాను. ఆయనకు నా పాట నచ్చింది, తాను తియ్యబోయే మొదటి సినిమాలో ఒక పాట పాడిస్తాననని వాగ్దానం చేశారు. సినిమా వాళ్లు కబుర్లు చెబుతారులే, అనుకుని, నా ప్రోగ్రామ్స్ నేను చేసుకుంటున్నాను. 1981లో జంధ్యాల ‘ముద్ద మందారం’ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాటడానికి రమ్మని కబురు చేశారు. ఆ రోజు నేను భీమవరంలో ప్రోగ్రామ్‌కు వెళ్లాలి. అది చాలాకాలం క్రితమే ఒప్పుకున్నా ను. రాకరాక వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు. భీమవరం ప్రోగ్రామ్ వాళ్లకి, ఒంట్లో బాగోలే ద చెప్పి, మద్రాసు వెళ్లిపోయాను. జంధ్యాలకు సుబ్బారావు, బాబన్న అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు హిందీ పాట ‘హమ్ కాలే హై తో క్యా దిల్ వాలే హై’ కు తెలుగు పేరడీ రాస్తున్నారు. నేను కూడా వారితో కలిసి ఆ పాట పూర్తి చేశాను. ఆ పాట జంధ్యాల నన్ను పాడమన్నారు. సంగీత దర్శకులు రమేశ్‌నాయుడు గాయకుడి గొంతు వింటేనే కాని అంగీకరించరు. కాని జంధ్యాల గారి మాటను గౌరవించి, నన్ను పాడమన్నారు. నేను ఎక్కువ శృతిలో పాడతానన్నాను. ఎంత శృతి కావాలి అన్నారు నాయుడుగారు. నేను ఆరున్నర అని చెప్పాను. పైస్థాయి పాడటం కష్టం, అయినా ఒకసారి చూద్దాంలే అని, నన్ను పాడమన్నారు. నేను గట్టిగా ‘నా షోలాపూర్ చెప్పులు’ అనగానే, శభాష్ అన్నారు. నా అదృష్టం కొద్దీ ఆయనకు నా పాట నచ్చింది. జంధ్యాల ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ పాటకు హిందీలో శంకర్ జైకిషన్ స్వరపరిచారు. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విజయా గార్డెన్స్‌లో రికార్డింగు. రాత్రి సరిగ్గా 7.10కి నన్ను పిలిచారు. పావు గంటసేపు రిహార్సల్స్ చేయించగానే, రికార్డింగు మొదలుపెట్టి, ఎనిమిదికల్లా పూర్తి చేసేశారు. ఈ పాటకు మంచి ప్రాచుర్యం వచ్చింది. బొంబాయిలో ప్రోగ్రామ్ చేస్తూ, ముందర హిందీలో పాడి అక్కడ నుంచి ‘నా షోలాపూరు చెప్పులు పెళ్లిలో పోయాయి/అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి ’ అంటూ పాడాను. ఈ ఒక్క పాటతోనే∙నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను జంధ్యాల గారికి ఋణపడి ఉంటాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
100 రోజుల ప్రయాణం
లఘుచిత్రాలు అంటే.. ప్రేమ, కామెడీ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఎంఆర్ ప్రొడక్షన్స్ విలువలతో కూడిన చిత్రాలను తీస్తూ వచ్చింది. వందో చిత్రంగా ‘ప్రయాణం’ లఘుచిత్రాన్ని 45 నిమిషాల నిడివితో తీసింది. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ వందో చిత్రం.. ఏడు లక్షల మంది వీక్షకులను మూటగట్టుకుంది. మంచి సంభాషణలు, మంచి సంగీతం.. మేళవించిన ‘ప్రయాణం’ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ఈ పొట్టిచిత్రంతో పాతకాలపు విలువలను మరోసారి గుర్తుచేశారు యువ దర్శకులు సుభాష్, ధీరజ్రాజ్. నాయికా నాయకులకు సీతారాముల పేర్లను పెట్టారు. పల్లెటూరుకు వెళ్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందని సీతను అక్కడకు పంపిస్తుంది ఆమె తల్లి. తాను రామ్‌ని ప్రేమిస్తున్న విషయం పల్లెకు వెళ్లాక తెలుసుకుంటుంది సీత. పెళ్లిపీటల మీదకు చేరిన ఈ ప్రేమను అందంగా చూపించారు. అలనాటి పెళ్లి ముచ్చట్లతో సరదాగా సాగిపోతుందీ చిత్రం. కాలక్షేపానికి ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం, మళ్లీ ప్రేమ, మళ్లీ బ్రేకప్.. జీవితమంటే ఇది కాదని ఈ చిత్రం ద్వారా చెప్పారీ దర్శకులు. - వైజయంతి -
తాత - మనవరాళ్లు
చిన్నారులకు మధుర జ్ఞాపకాన్ని అందించింది ‘సాక్షి’. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన ఆ పల్లె వెలుగులను పట్నం తీసుకొచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావును వారికి తాతయ్యను చేసింది. సినీ నటి కేథరిన్‌తో సరదాగా కాసేపు ఆడించింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ చిన్నారులకు ఎల్లల్లేని ఆనందాన్ని అందించి బోలెడన్ని స్వీట్ మెమరీస్‌తో తిరిగి ఇళ్లకు చేర్చింది. మెదక్ జిల్లా మాసాయిపేట ట్రైన్యాక్సిడెంట్ విషాదం ఇంకా ఎవరి మనసుల్ని మరిపించలేదు. ఆ సంఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం! సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన! పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర! ఖోఖోలో నల్లగొండ వ్యూహాన్ని నేషనల్వైడ్గా చాటుతున్న క్రీడారత్నం వైజయంతి! ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్మన్నాయి.. ‘సాక్షి’ సిటీప్లస్కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్సు డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు! జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30 ఎర్రబస్సు సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావిడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలుమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. డైనమిక్‌గా ఉండాలి.. ఎర్రబస్సు సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటీ తాతయ్య అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను. ఈతలు, కొబ్బరి బొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి. ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు. ‘ఇంతకీ పెద్దాయ్యాక మీరెమవ్వాలనుకుంటున్నారు’ అని నలుగురినీ అడిగితే ‘జడ్జి అవుతాను’ అని రుచిత, ‘పోలీస్ ఆఫీసర్’ అని వైజయంతి, ‘అగ్రికల్చర్ జర్నలిస్ట్’ అని మయూర, ‘సైంటిస్ట్’ అని అర్చన జవాబు చెప్పారు. ‘శభాష్.. తప్పక కావాలి. ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవాలమ్మా’ అంటూ ప్రోత్సహించారు. వాళ్ల ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి. -
తాత - మనవరాళ్లు
మాసాయిపేట ట్రైన్యాక్సిడెంట్ విషాదం ఇంకా ఎవరి మనసుల్ని మరిపించలేదు. ఆ సంఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం! సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన! పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర! ఖోఖోలో నల్లగొండ వ్యూహాన్ని నేషనల్వైడ్గా చాటుతున్న క్రీడారత్నం వైజయంతి! ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్మన్నాయి.. సిటీప్లస్కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్ డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు! జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30 ఎర్రబస్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావిడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలుమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. డైనమిక్‌గా ఉండాలి.. ఎర్రబస్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటీ తాతయ్య అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను. ఈతలు, కొబ్బరిబొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి. ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు. ‘ఇంతకీ పెద్దాయ్యాక మీరెమవ్వాలనుకుంటున్నారు’ అని నలుగురినీ అడిగితే ‘జడ్జి అవుతాను’ అని రుచిత, ‘పోలీస్ ఆఫీసర్’ అని వైజయంతి, ‘అగ్రికల్చర్ జర్నలిస్ట్’ అని మయూర, ‘సైటింస్ట్’ అని అర్చన జవాబు చెప్పారు. ‘శభాష్.. తప్పక కావాలి. ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవాలమ్మా’ అంటూ ప్రోత్సహించారు. వాళ్ల ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి. ప్రెజెంటర్: సరస్వతి రమ ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
ఇల్లెక్కిన తోట...
రాజుల కాలంలో డాబాల మీద చంద్రశాల ఉండేదని కథలలో విన్నాం... వాటినే ఇప్పుడు ఇంటి మీద తోటగా నిర్మిస్తున్నారు... అవే టై గార్డెన్లు. ఇవి కంటికి పచ్చదనం, ఒంటికి ఆరోగ్యం రెండూ ఇస్తున్నాయి... మహానగరాలలో ఎక్కడ చూసినా బహుళ అంతస్థులు, పచ్చిక కనిపించకుండా సిమెంటు రోడ్లు, బిజీబిజీ జీవనశైలి. ఇక స్వచ్ఛమైనగాలికి చోటేది? ప్రశాంత వాతావరణంలో కాలుష్యం లేని గాలి పీల్చుకోవడానికి పార్కులే శరణ్యం అయ్యాయి. అయితే అక్కడకు వెళ్లేంత తీరిక ఏదీ? అటువంటి వారికోసం ఏర్పడినవే టై గార్డెన్లు. టై గార్డెన్ అనేది చాలా సంవత్సరాలుగా సంపన్న వర్గాలకే పరిమితమై ఉంది. ప్రస్తుతం ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా తయారుచేసుకోవాలి... టై గార్డెన్‌ని ఏర్పాటు చేసుకోవడానికి, ముఖ్యంగా మనకు ఎంత స్థలం ఉందో, ఎండ ఎటు వైపు నుంచి ఎటు పడుతోందో చూసుకోవాలి టై గార్డెన్‌ని ఏర్పాటు చేయడానికి ముందుగా స్లాబ్‌ని లీక్ ప్రూఫ్ చేయించుకోవాలి. ఆ తరువాత జి.ఐ.టెక్స్టైల్ అండ్ డ్రెయిన్ సెల్స్ అండ్ బర్న్ట్ బ్రిక్స్ వేయాలి ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వేసే ముందు ఆ బరువుని స్లాబ్ తట్టుకుంటుందా? లేదా? గమనించాలి వర్షం వ చ్చినప్పుడు నీళ్లు ఎటు వెళ్లాలో ముందుగానే చూసుకోవాలి అవగాహన లేకుండా ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వాడేస్తే, స్లాబ్ బరువు పెరిగి నీళ్లు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. నిపుణులైన లాండ్స్కేప్ డిజైనర్ల సలహాలతో చేయించుకోవటం మంచిది. టై గార్డెన్ వల్ల ఉపయోగాలు... స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది ఇంటి పరిసర ప్రాంతంలో దుమ్ము ధూళిని గ్రహించి కాలుష్య రహితంగా ఉంచుతుంది ఇంటిని చల్లగా ఉంచుతుంది వేసవికాలంలో సాయంకాలాలు సేద తీరుస్తూ, శరీరానికి హాయినిస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న అనుభూతిని కలిగిస్తుంది. - డా. వైజయంతి అందంగా ఉండ టానికి... పూలమొక్కలు, పూలతీగలలాంటి సీజనల్ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల టై గార్డెన్‌కి శోభ వస్తుంది విద్యుద్దీపాలు ఏర్పాటుచేసుకుంటే సాయంత్రాలు తారకలు నేల మీదకు వచ్చిన అనుభూతి కలుగుతుంది స్థలాన్ని బట్టి ఊయల లేదా సిమెంట్ బెంచ్లుఏర్పాటుచేసుకోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, వెన్నెలలో భోజనం చేస్తూ ఆనందించడానికి అవకాశం ఉంటుంది వాటర్ ఫాల్ కాని వాటర్ ఫౌంటెయిన్ కాని ఏర్పాటుచేసుకోవచ్చు. లోటస్ పాండ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. - కె.పి.రావు, వెంకటేశ్వర నర్సరీ అండ్ గార్డెన్స్