లఘుచిత్రాలు అంటే.. ప్రేమ, కామెడీ వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇందుకు భిన్నంగా ఎంఆర్ ప్రొడక్షన్స్ విలువలతో కూడిన చిత్రాలను తీస్తూ వచ్చింది. వందో చిత్రంగా ‘ప్రయాణం’ లఘుచిత్రాన్ని 45 నిమిషాల నిడివితో తీసింది. వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ వందో చిత్రం.. ఏడు లక్షల మంది వీక్షకులను మూటగట్టుకుంది. మంచి సంభాషణలు, మంచి సంగీతం.. మేళవించిన ‘ప్రయాణం’ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది.
ఈ పొట్టిచిత్రంతో పాతకాలపు విలువలను మరోసారి గుర్తుచేశారు యువ దర్శకులు సుభాష్, ధీరజ్‌రాజ్. నాయికా నాయకులకు సీతారాముల పేర్లను పెట్టారు. పల్లెటూరుకు వెళ్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుందని సీతను అక్కడకు పంపిస్తుంది ఆమె తల్లి. తాను రామ్‌ని ప్రేమిస్తున్న విషయం పల్లెకు వెళ్లాక తెలుసుకుంటుంది సీత. పెళ్లిపీటల మీదకు చేరిన ఈ ప్రేమను అందంగా చూపించారు. అలనాటి పెళ్లి ముచ్చట్లతో సరదాగా సాగిపోతుందీ చిత్రం. కాలక్షేపానికి ప్రేమించడం, బ్రేకప్ చెప్పడం, మళ్లీ ప్రేమ, మళ్లీ బ్రేకప్.. జీవితమంటే ఇది కాదని ఈ చిత్రం ద్వారా చెప్పారీ దర్శకులు.
- వైజయంతి
100 రోజుల ప్రయాణం
Published Sun, Apr 26 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement