ఇల్లెక్కిన తోట...
రాజుల కాలంలో డాబాల మీద చంద్రశాల ఉండేదని కథలలో విన్నాం... వాటినే ఇప్పుడు ఇంటి మీద తోటగా నిర్మిస్తున్నారు... అవే టై గార్డెన్‌లు. ఇవి కంటికి పచ్చదనం, ఒంటికి ఆరోగ్యం రెండూ ఇస్తున్నాయి...
మహానగరాలలో ఎక్కడ చూసినా బహుళ అంతస్థులు, పచ్చిక కనిపించకుండా సిమెంటు రోడ్లు, బిజీబిజీ జీవనశైలి. ఇక స్వచ్ఛమైనగాలికి చోటేది? ప్రశాంత వాతావరణంలో కాలుష్యం లేని గాలి పీల్చుకోవడానికి పార్కులే శరణ్యం అయ్యాయి. అయితే అక్కడకు వెళ్లేంత తీరిక ఏదీ? అటువంటి వారికోసం ఏర్పడినవే టై గార్డెన్‌లు. టై గార్డెన్ అనేది చాలా సంవత్సరాలుగా సంపన్న వర్గాలకే పరిమితమై ఉంది. ప్రస్తుతం ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
ఇలా తయారుచేసుకోవాలి...
టై గార్డెన్‌ని ఏర్పాటు చేసుకోవడానికి, ముఖ్యంగా మనకు ఎంత స్థలం ఉందో, ఎండ ఎటు వైపు నుంచి ఎటు పడుతోందో చూసుకోవాలి టై గార్డెన్‌ని ఏర్పాటు చేయడానికి ముందుగా స్లాబ్‌ని లీక్ ప్రూఫ్ చేయించుకోవాలి. ఆ తరువాత జి.ఐ.టెక్స్‌టైల్ అండ్ డ్రెయిన్ సెల్స్ అండ్ బర్న్‌ట్ బ్రిక్స్ వేయాలి ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వేసే ముందు ఆ బరువుని స్లాబ్ తట్టుకుంటుందా? లేదా? గమనించాలి వర్షం వ చ్చినప్పుడు నీళ్లు ఎటు వెళ్లాలో ముందుగానే చూసుకోవాలి అవగాహన లేకుండా ఎర్రమట్టి, ఇతర ముడిపదార్థాలు వాడేస్తే, స్లాబ్ బరువు పెరిగి నీళ్లు ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. నిపుణులైన లాండ్‌స్కేప్ డిజైనర్‌ల సలహాలతో చేయించుకోవటం మంచిది.
టై గార్డెన్ వల్ల ఉపయోగాలు...
స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది ఇంటి పరిసర ప్రాంతంలో దుమ్ము ధూళిని గ్రహించి కాలుష్య రహితంగా ఉంచుతుంది ఇంటిని చల్లగా ఉంచుతుంది వేసవికాలంలో సాయంకాలాలు సేద తీరుస్తూ, శరీరానికి హాయినిస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న అనుభూతిని కలిగిస్తుంది.
- డా. వైజయంతి
అందంగా ఉండ టానికి...
పూలమొక్కలు, పూలతీగలలాంటి సీజనల్ ప్లాంట్స్ పెట్టుకోవటం వల్ల టై గార్డెన్‌కి శోభ వస్తుంది విద్యుద్దీపాలు ఏర్పాటుచేసుకుంటే సాయంత్రాలు తారకలు నేల మీదకు వచ్చిన అనుభూతి కలుగుతుంది స్థలాన్ని బట్టి ఊయల లేదా సిమెంట్ బెంచ్‌లుఏర్పాటుచేసుకోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి, వెన్నెలలో భోజనం చేస్తూ ఆనందించడానికి అవకాశం ఉంటుంది వాటర్ ఫాల్ కాని వాటర్ ఫౌంటెయిన్ కాని ఏర్పాటుచేసుకోవచ్చు. లోటస్ పాండ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.
- కె.పి.రావు,
వెంకటేశ్వర నర్సరీ అండ్ గార్డెన్స్