పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా ‘కర్తవ్యం’ (1990)లో విజయశాంతి నటనను అంత సులువుగా మరచిపోలేం. లేడీ అమితాబ్ అనిపించుకున్న ఈ యాక్షన్ స్టార్ మళ్లీ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనే వైజయంతి పాత్రలో కనిపించనున్నారు విజయశాంతి. సోమవారం (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె లుక్, క్యారెక్టర్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు.
చీరకట్టులో హుందాగా, ఖాకీ దుస్తుల్లో పవర్‌ఫుల్‌గా విజయశాంతి కనిపించగా, ‘వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫామ్‌కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...’ అంటూ ఆమె పాత్ర గురించి కల్యాణ్ రామ్ తన వాయిస్ ఓవర్‌తో ఆ వీడియోలో వివరించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment