
∙సునిల్ బలుసు, అశోక్ వర్ధన్, కల్యాణ్‌రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి
‘‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయమని చాలామంది నన్ను కోరారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi) చిత్రంలో అలాంటి యాక్షన్ కుదిరింది. నా అభిమానులకి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ దొరుకుతుంది. చాలా రోజుల తర్వాత యాక్షన్ చేశాను.. నేను చేస్తానని యూనిట్ వాళ్లు ఊహించలేదు. అయితే అదే పౌరుషం.. అదే రోషం.
తగ్గేదేలే. ఎంత వయసు అయినా ఇలానే స్ట్రాంగ్‌గా ఉంటాను. క్రమశిక్షణగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది’’ అని నటి విజయశాంతి(Vijayashanti) చెప్పారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు నిర్మించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ టీజర్‌లాంచ్‌లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌రామ్‌కి సినిమా అంటే చాలా ప్యాషన్. రామారావుగారు నేర్పించిన అంకితభావం అది. ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలి’’అన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ–‘‘ అమ్మ (విజయశాంతి) చేసిన ‘కర్తవ్యం’ సినిమాని ఎవరూ మర్చిపోలేం. ఆ మూవీలోని వైజయంతి పాత్రకి కొడుకు పుడితే ఎలాంటి ఘటనలు జరుగుతాయి? అనేది ఈ చిత్ర కథ.
నేను నటించిన ‘అతనొక్కడే’ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అలాగే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కూడా మరో 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది’’ అని తెలిపారు. ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘కల్యాణ్ రామ్‌గారు ఈ కథ విని.. విజయశాంతిగారు ఒప్పుకుంటేనే చేద్దామన్నారు. మేడంగారు ఒప్పుకోవడంతో ఈప్రాజెక్టు ముందుకెళ్లింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత సునీల్ బలుసు. ఈ కార్యక్రమంలో నటుడు పృథ్వీరాజ్, రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment