
కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలకపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ని ఆరంభించనున్నారు మేకర్స్.
అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నాయాల్ది...’ అంటూ సాగే తొలిపాటని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘‘యాక్షన్ ΄ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్, పృథ్వీరాజ్, సోహైల్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రామ్ ప్రసాద్.