మీకు తెలిసినోడి కథ | Allari Naresh Bachala Malli movie new poster release | Sakshi
Sakshi News home page

మీకు తెలిసినోడి కథ

Published Wed, Nov 20 2024 12:28 AM | Last Updated on Wed, Nov 20 2024 12:28 AM

Allari Naresh Bachala Malli movie new poster release

‘అల్లరి’ నరేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్‌ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, ‘వైవా’ హర్ష ఇతర కీలకపాత్రలుపోషించారు. 

‘బచ్చలమల్లి’ సినిమాను డిసెంబరు 20న రిలీజ్‌ చేస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్తపోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘ఇది మీ కథ... లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని ఈ సినిమాను ఉద్దేశించి, ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ఈ సినిమాకు సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్‌ ఎమ్‌. నాథన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement