
అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్‌లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్‌గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటారు.
తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్‌ను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment