
శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి (ఫైల్)
సాక్షి, రాజమండి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఇటీవల మరణించారు. (ప్రముఖ దర్శకుడికి పితృవియోగం)
Comments
Please login to add a commentAdd a comment