mother passed away
-
ఏపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం
సాక్షి, కృష్ణా: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. దీంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు సంఘీభావం చెబుతున్నారు. ఇదీ చదవండి: 24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం -
మావోయిస్టు అగ్రనేత జగన్‌కు మాతృవియోగం
సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. పండన్న అలియాస్ జగన్ స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలోని కొమ్ములవాడ గ్రామం. పండన్న ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి తల్లి సీతమ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు. ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు చూసుకోవాలని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన జగన్, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు. -
ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ -
పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం
సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తల్లి, బలిజిపేట మండలం మాజీ ఎంపీపీ అలజంగి సంతోషమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆమె కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చిలకలపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె 2001–06లో బలిజిపేట ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త స్వర్గీయ అలజంగి సత్యం చిలకలపల్లి సర్పంచ్‌గా 1987–1998 వరకు పనిచేశారు. వీరికి ఆరుగురు మగపిల్లలు. వీరిలో ఎమ్మెల్యే జోగారావు 6వ సంతానం. బలిజిపేట మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఎ.రవికుమార్ 4వ వాడుకాగా, ప్రస్తుత చిలకలపల్లి సర్పంచ్ సుందరావు 3వ సంతానం. సంతోషమ్మ కోడలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి సూపరెంటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ వాగ్దేవి. సంతోషమ్మ మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఆమె కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.జయమణి, టిడ్కోచైర్మన్ జమ్మానప్రసన్నకుమార్, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ వి.నాగేశ్వరరావు, పార్వతీపురంమున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు రుక్మిణిబాలకృష్ణ, గున్నేశ్వరరావు, కమిషనర్ సింహాచలం, నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పరామర్శించారు. తల్లి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే జోగారావు -
సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి మాతృవియోగం
సాక్షి, అమరావతి\ న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం (88) శనివారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. అస్వస్థత, వృద్ధాప్య సమస్యలతో ఆమె మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 1933 జూన్ 6న పాపాయ్యమ్మ, కందా భీమశంకరం దంపతులకు కల్పకం మద్రాసులో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు వేముగంటి బొప్మాయమ్మ, అనేకమంది ఇతర కార్యకర్తలతో కలసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఏర్పాటు చేసిన బాలికాసేనలో సభ్యురాలిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ దివ్యాంగుల బాలికల పాఠశాల, బాలభవన్‌లకు కన్వీనర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మహిళా మండలి అక్షరాస్యత ఉద్యమం, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ, ఆంధ్రా వనితామండలి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేసినందుకు దుర్గాబాయి దేశ్‌ముఖ్ పేరిట ఇచ్చే అవార్డుకు ఎంపికయ్యారు. కల్పకం బాల్యంలోనే ఏచూరి సర్వేశ్వర సోమయాజులుతో వివాహం జరిగింది. అర్ధంతరంగా ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ’ఇండియా అండ్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్’ అంశంలో ఎంఫిల్ చేశారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఇటలీ, మలేషియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వివిధ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె చేసిన భరతనాట్య ప్రదర్శనలకు 80కి పైగా పతకాలు గెలుచుకున్నారు. కల్పకం రెండో కుమారుడు భీమశంకర్ ఏచూరి మారుతి ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశారు. ఆమె సోదరుడు మోహన్ కందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. కల్పకం భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు దానం చేశారు. ఆమె మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వై.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీఐ నేతలు కె.నారాయణ, కె.రామకృష్ణ , ఏపీ, మహారాష్ట్ర సీపీఎం కమిటీలు, కేరళ సీఎం పినరయి విజయన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. -
మంత్రి బొత్స ఇంట్లో విషాదం
సాక్షి, విశాఖపట్నం : పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.సుమారు గత నెల రోజులుగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు కాగా రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలోని స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించారు. మరోవైపు పలువురు వైఎస్సార్ సీపీ నేతలు ...బొత్స సత్యనారాయణను పరామర్శించి, సంతాపం తెలిపారు. -
సంచలన క్రికెటర్ ఇంట విషాదం
కాబూల్: అఫ్గానిస్తాన్ యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గతకొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్లో రషీద్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. 'అమ్మా.. నువ్వే నా సర్వసం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి'అంటూ రషీద్ ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. (అచ్చం స్మిత్‌ను దింపేశావ్‌గా..) ఇటీవల తన తల్లి ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించిందని.. ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకు, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రషీద్ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ ఆఫ్గాన్ సంచలనం తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. పొట్టిక్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ అనతికాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగిపోయాడు. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُوْنَ You were my home my mother I had no home but you . i can’t believe you are no more with me you will missed forever . Rest In Peace #MOTHER 😢😢 — Rashid Khan (@rashidkhan_19) June 18, 2020 -
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం నెలకొంది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. చిరంజీవి, రజినీకాంత్ వంటి సూపర్స్టార్లు నటించిన సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. (‘వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేస్తా..’) సుకుమార్ దర్శకత్వం వహించే అన్ని సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇక రత్నవేలు తల్లి చనిపోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు రత్నవేలు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. MY Mother One who understood my dream&passion without words by just looking at eyes She stood by me Supported me&made sure,I succeed&achieve wht ever I wish in Life! wht I'm today is because of her! My inspiration My almighty My happiness Amma" I miss you" gratitude4evrLUV pic.twitter.com/K0oBxnHMl2 — Rathnavelu ISC (@RathnaveluDop) March 21, 2020 -
దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం
సాక్షి, రాజమండి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజి(68) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. అమ్మాజికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం. శ్రీవాస్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం సినిమాతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం సినిమాలను ఆయన తెరకెక్కించారు. దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ, హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు ఇటీవల మరణించారు. (ప్రముఖ దర్శకుడికి పితృవియోగం) -
ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం
సాక్షి,చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిమూలం తల్లి కాంతమ్మ(86) తన స్వగ్రామం నారాయణవనం మండలంలోని భీముని చెరువులో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆదిమూలం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రగాడ సంతాపం తెలియజేశారు. -
బాలీవుడ్ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత
ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ కైఫీ ముంబయిలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ వెల్లడించారు. 93 ఏళ్ల షౌకత్ కైఫీ డ్రామా ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈమె ఉర్థూ కవి, పాటల రచయిత అయిన కైఫీ అజ్మీని వివాహం చేసుకున్నారు. వీరికి షబానా అజ్మీతో సినిమాటోగ్రఫర్ బాబా అజ్మీలు సంతానం. షౌకత్ కైఫీ గత కొంతకాలంగా గుండెసంబంధింత వ్యాధితో బాధపడుతున్నారని, ముంబయిలోని దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారని జావేద్ అక్తర్ వెల్లడించారు. వయసు మీద పడడంతో ఆమె శరీరీం చికిత్సకు సహకరించకపోవడంతో ముంబయిలోని తన నివాసానికి తీసుకువచ్చామని తెలిపారు. షౌకత్ కైఫీ తన తుదిశ్వాసను తన రూంలోనే విడవాలనుకుంటున్నట్లు మాకు చేస్సిందని తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో షౌకత్ కైఫీ తన గదిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. కాగా, షౌకత్ కైఫీ మరణించారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ట్విటర్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. Rest In Peace #ShaukatKaifi aapa 🙏 The old world of poetry,theatre and integrity coming to a closure bit by bit. pic.twitter.com/ak3Q38kEMh — Rajiv B Menon (@crypticrajiv) November 23, 2019 Love conquers all ❤#ShaukatKaifi 🌸 pic.twitter.com/4ASZ86jrle — Sheba Ghildyal(शैबा) (@ShebaGhildyal) November 23, 2019 -
నిర్మాత ఆదిత్యరామ్ తల్లి పి.లక్ష్మీ కన్నుమూత
ప్రముఖ నిర్మాత ఆదిత్యరామ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శ్రీమతి పి.లక్ష్మి (70) శనివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యారామ్ నగర్లో జరిగాయి. చెన్నైలో ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్యరామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్ ‘సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ వంటి చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. పి.లక్ష్మికి నలుగురు సంతానం. ముగ్గరు కుమారులు ఆదిత్యరామ్, శ్రీనివాసరావు, సతీష్, ఒక కుమార్తె అనంతలక్ష్మి ఉన్నారు. -
ప్రముఖ నిర్మాతకు మాతృవియోగం
చెన్నై: ప్రముఖ నిర్మాత, ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత ఆదిత్యరామ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి పి లక్ష్మీ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆదిత్యరామ్ సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ సినిమాలను నిర్మించారు. ఆయన ఆదిత్యరామ్ గ్రూప్ కంపెనీలకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ఆమె అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యరామ్ నగర్లో ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. -
దేవగుడి సోదరులకు మాతృవియోగం
ఆసుపత్రిలో భౌతిక కాయాన్ని సందర్శించిన వైఎస్ జగన్ హైదరాబాద్: దేవగుడి సోదరులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిల మాతృమూర్తి సి.వెంకటసుబ్బమ్మ (77) మంగళవారం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస సంబంధ వ్యాధి వల్ల ఆమె మూత్ర పిండాల పనితీరు కూడా క్షీణించింది. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు. మరణ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి 10.45 గంటల ప్రాంతంలో స్టార్ ఆసుపత్రికి వెళ్లి వెంకటసుబ్బమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి తన సంతాపాన్ని తెలిపారు. అక్కడే ఉన్న ఆది, నారాయణరెడ్డిలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగన్ వెంట వచ్చి వెంకటసుబ్బమ్మ భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఉన్నారు. -
వట్టి వసంతకుమార్ మాతృమూర్తి కన్నుమూత
భీమడోలు : రాష్ర్ట మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మాతృమూర్తి వట్టి వాసుకి(82) శనివారం కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి. కుమారులు మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, రమేష్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఉమ్మడి ఆంధ్రరాష్ర్టంలో పసల సూర్యచంద్రరావు డెప్యూటీ స్వీకర్‌గా పని చేశారు. ఆయన ఏకైక కుమార్తె వాసుకి. ఆమెకు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారధితో వివాహం జరిగింది. భర్త, కుమారుడు రాజకీయాల్లో రాణించేందుకు పూర్తి సహాయ సహకారాలందించిన వాసుకి సేవలు ఎనలేనివని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల సంతాపం ఏలూరు (టూటౌన్) : రాష్ట్ర సహకార కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు రాత్రి ఎంఎంపురంలోని వసంత్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వాసుకి మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, జడ్పీ మాజీ చైర్మన్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు. వైసీపీ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు( ఉంగుటూరు) తలారి వెంకట్రావు (గోపాలపురం), గంటా మురళీకృష్ణ, వైసీపీ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లా నాయకులు కరాటం రాంబాబు, నాయకులు కరణం పెద్దిరాజు, బాదర్వాడ కృష్ణమోహనరాజు, వగ్వాల భాస్కర్, దేవినేని అవినాష్, , కారుమంచి రమేష్, జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన వివిధ వర్గాల నాయకులు నివాళులర్పించారు. -
గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం
హైదరాబాద్: నల్గొండ కాంగ్రెస్ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరస్వతమ్మ ఆస్పత్రిలో చికిత్స సోమవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరస్వతమ్మ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలమైన చిట్యాల మండలం ఊరమడ్లలో అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు గుత్తాకు పలువురు నేతలు సంతాపం తెలిపారు. -
వివి వినాయక్ కు మాతృవియోగం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నం(59) మంగళవారం కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వినాయక్ తల్లి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు వినాయక్ స్వస్థలం. ఆయన తండ్రి కృష్ణారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.