
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్‌లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్‌లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్‌కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం.
తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
చదవండి:
హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ
Comments
Please login to add a commentAdd a comment