మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్‌ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్‌ | Actor Vadivelu Son Subramani Comments On His Life Style | Sakshi
Sakshi News home page

మారుమూల గ్రామంలో లెజండరీ కమెడియన్‌ కుమారుడు.. పెళ్లి ఫోటో వైరల్‌

Published Tue, Jan 23 2024 12:07 PM | Last Updated on Tue, Jan 23 2024 12:22 PM

Actor Vadivelu Son Subramani Comments On His Life Style - Sakshi

సౌత్‌ ఇండియాలో  ప్రముఖ హాస్య నటుల్లో నటుడు వడివేలు ఒకరు. కోలీవుడ్‌లో అయితే ఆయనొక లెజండ్‌ అని చెప్పవచ్చు. గతంలో కొన్ని సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉ‍న్న ఆయన మళ్లీ తెరపై కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన మామన్నన్‌లో వడివేలు నటనను చూసిన వారందరూ కూడా ఫిదా అయ్యారు. ఇంతటి పాపులారిటీ వచ్చినా తన కుటుంబాన్ని ఎప్పుడూ పబ్లిక్‌గా కెమెరా ముందు ఆయన చూపించడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా తక్కువ మందితోనే ముగించేస్తాడు. కెమెరా వాళ్లను కూడా లోపలికి అనుమతివ్వడు. దీంతో ఆయనకు అబ్బాయితో పాటు అమ్మాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వారి ఫోటోలు బయట పెద్దగా కనిపించవు.

తాజాగా వడివేలు కుమారుడి పెళ్లి నాటి ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. వడివేలు కుమారుడి పేరు సుబ్రమణి ఆయన సుమారు 10 ఏళ్ల క్రితమే తనకు మరదలు వరుస అయ్యే భువనేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో వడివేలు వద్ద ఎంతో డబ్బు, కార్లు, ఆస్తులు ఉన్నా కూడా తనకు దగ్గరి బంధువు అయిన ఆమెనే తన కోడిలిగా తెచ్చుకున్నాడు. తన వియంకుడు కూడా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారి పెళ్లి కూడా చాలా తక్కువ మంది సమక్షంలోనే జరిగింది. 

కష్టపడటం నేర్పించాడు
గతంలో ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి వడివేలు గురించి సుబ్రమణి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తనకూ కూడా సినిమాల్లో నటించాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా ఛాన్సుల కోసం తన తండ్రి వడివేలు ఎలాంటి సిపారసులు చేయలేదని చెప్పాడు. సిపారసు ద్వారా అవకాశం వస్తే ఎక్కువ కాలం నిలబడలేవని చెప్పడంతో తన తండ్రి పేరు ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదని ఆయన చెప్పాడు.  తన తండ్రి అంటే చాలా ఇష్టమని తన పిల్లలకు కూడా వడివేలే పేరు పెట్టినట్లు చెప్పాడు. 

తనకు ఏ అవసరం వచ్చినా వడివేలు సాయం చేస్తాడని ఆయన చెప్పాడు. అయనప్పటికీ తన తండ్రి మీద ఆధారపడకుండా జీవిస్తున్నట్లు సుబ్రమణి పేర్కొన్నాడు. కష్టపడి పనిచేయడం నేర్పించాడు అది చాలు అని ఆయన వినమ్రంగా చెప్పాడు. తనకు వడివేలు అంటే ఎంతో ప్రాణమని పేర్కొన్నాడు. పలుమార్లు సిటీకి రమ్మని నాన్నగారు చెప్పినా తాను వెళ్లలేదని సుబ్రమణి తెలపాడు. పండుగలు వస్తే అందరం కలిసి సంతోషంగా గడుపుతామని తెలిపాడు. ప్రస్తుతం ఆయన తన తండ్రి వడివేలు నుంచి వారసత్వంగా వచ్చిన పొలంలో ఒక మారు మూల గ్రామంలో వ్యవసాయమే చేసుకుంటున్నట్లు సమాచారం.


(వడివేలు కూతురు కార్తీక పెళ్లి ఫోటో)

ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటో కోలీవుడ్‌లో భారీగా ట్రెండింగ్‌ అవుతుంది. వడివేలుతో ఒక్కసారైనా వెండితెర మీద కనిపించాలనే కోరిక ఉన్నట్లు ఆయన చెప్పాడు. ఎప్పటికైన తెరపై కనిపిస్తానని ఆయన పేర్కొన్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా తన తండ్రి మీద ఆధారపడకుండా  గ్రామీణ ప్రాంతంలో తన కష్టంతో  జీవిస్తున్న సుబ్రమణి గురించి నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. పల్లెటూరులో ఉండే తన స్నేహితులతో కలిసే ఆ ఇంటర్వ్యూ ఇవ్వడంతో అది చాలా రోజుల నుంచి వైరల్‌ అవుతూనే ఉంది. తనకు హీరో విజయ్‌, అజిత్‌ అంటే చాలా ఇష్టమని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement