ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో నటుడు విజయ్ గురించి చర్చ ఎక్కువగానే జరుగుతోందని చెప్పవచ్చు అందుకు కారణం ఆయన రాజకీయ రంగప్రవేశం చేయడమే. విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకోవడం కూడా చర్చకు దారి తీసింది. లేకపోతే ఈ చిత్రం తర్వాత విజయ్ తన 69వ చిత్రం చేసి సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పి రాజకీయాలకే పరిమితం కానున్నారు. ఈ చిత్రం కూడా అక్టోబర్‌లోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ రాజకీయ జీవితానికి ప్రయోజనం ఇచ్చే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో హీరో విజయ్ నిర్ణయాలను తమిళ దర్శకుడు మోహన్.జి తప్పుపట్టారు. కోలీవుడ్‌లో ద్రౌపది వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా మోహన్.జి. గుర్తింపు పొందారు. ప్రస్తుతం మరో చిత్రం చేయడానికి ఈయన సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ మాట్లాడుతూ.. విజయ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారంటూ విమర్శించారు. ఆయన కోరుకుంటున్నట్లుగా దేశ ప్రజలకు ఒక మంచి నేత అవసరం అన్నారు. విజయ్ అందరికీ, ముఖ్యంగా యువతకు నచ్చేలా ఉండడం ఇంకా మంచిది అన్నారు. అయితే విజయ్ రాంగ్ రూట్లో వెళ్తుండడమే బాధగా ఉందని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలపని విజయ్ ఓనం పండుగకు మాత్రం శుభాకాంక్షలు చెప్పడం బాధగా ఉందన్నారు.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్)
వినాయక చవితికి శుభాకాంక్షలు చెబితే హిందువులకు మద్దతు చెప్పినట్టు అవుతుందని, దీంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో ఉండడం వల్ల ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని పలువురు శుభాకాంక్షలు తెలపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు . అయితే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం వేరు బీజేపీకి మద్దతు తెలపడం వేరని, ఈ రెండింటిని ఒకేలా చూసే మనస్తత్వాన్ని ముందుగా మార్చుకోవాలని దర్శకుడు మోహన్ జి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment