ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)
ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.
ఇక వడివేలు పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment