singamuthu
-
స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.ఇక వడివేలు పిటిషన్ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
కోర్టు బోనెక్కిన హాస్యనటులు
చెన్నై: ఎట్టకేలకు హాస్యనటుడు వడివేలు, సింగముత్తులు గురువారం కోర్టు బోనులో నిలబడ్డారు. వీరిద్దరి కేసు చాలా కాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. వడివేలు, సింగముత్తు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఆ తరువాతే స్థలం కొనుగోలు వ్యవహారంలో శత్రువులుగా మారి ఒకరినొకరు విమర్శించుకున్నారు. నటుడు వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారు. అయితే ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించి సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 7వ తేదీన నటులు వడివేలు, సింగముత్తు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి మురళీధరన్ ఆదేశాలు జారీ చేసినా వారు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 20వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో నిన్న వడివేలు, సింగముత్తు ఇద్దరు హైకోర్టులో హాజరయ్యారు. కాగా ఈ స్థల మోసం వ్యవహారంలో ఈ నటులిద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమి జరగలేదని తెలియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
మంటగలిసిన మానవత్వం
తమిళసినిమా: ఎట్టకేలకు హాస్యనటుడు వడివేలు, సింగముత్తులు గురువారం కోర్టు బోనులో నిలబడ్డారు. వీరిద్దరి కేసు చాలా కాలంగా చెన్నై హైకోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. వడివేలు, సింగముత్తు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఆ తరువాతే స్థలం కొనుగోలు వ్యవహారంలో శత్రువులుగా మారి ఒకరినొకరు విమర్శించుకున్నారు. నటుడు వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించారు. అయితే ఆ స్థలాన్ని నకిలీ దస్తావేజులతో కొనిపించి సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు చాలాకాలంగా హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నెల 7వ తేదీన నటులు వడివేలు, సింగముత్తు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి మురళీధరన్ ఆదేశాలు జారీ చేసినా వారు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి 20వ తేదీన కోర్టుకు హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో గురువారం వడివేలు, సింగముత్తు ఇద్దరు హైకోర్టులో హాజరయ్యారు. కాగా ఈ స్థల మోసం వ్యవహారంలో ఈ నటులిద్దరూ చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అలాంటిదేమి జరగలేదని తెలియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. -
అన్న మీద పగతో రగులుతున్న చెల్లెమ్మ
చెన్నై: అమ్మ మెప్పుతో సీటు దక్కితే, తోడపుట్టిన చెల్లెమ్మ రూపంలో చిక్కులు ఎదురు కావడం అన్నాడీఎంకే అభ్యర్థిని ఇరకాటంలో పడ్డారు. సీటు ఉంటుందో, ఊడుతుందో అన్న డైలమాలో పడ్డారు. ఇంతకీ ఈ అభ్యర్థి ఎవరో కాదు సింగానల్లూరు సింగముత్తు. అన్నాడీఎంకేలో సీటు దక్కడం అంటే ఆషామాషీ కాదన్న విషయం తెలిసిందే. అదేసమయంలో చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా సీటు తక్షణం ఊడడం ఖాయం. ఇలా అన్నాడీఎంకేలో పలువురి అభ్యర్థిత్వాలు తాజాగా రద్దు అయ్యాయి. మరి కొందరిపై వేటుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు జిల్లా సింగానల్లూరు అభ్యర్థి సింగముత్తుకు తోడ పుట్టిన చెల్లెమ్మ రూపంలోనే చిక్కులు ఎదురు కావడంతో సీటు ఉంటుందా? ఊడుతుందా? అని అన్నాడీఎంకే వర్గాలే పందెం కాస్తున్నాయట. ఇంతకీ తోడపుట్టిన అన్న మీద ఆ చెల్లెమ్మకు కోపం ఏమిటంటే, ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదట. తోడ పుట్టినోడికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా సింగనల్లూరులో నామినేషన్ దాఖలు చేసిన సింగముత్తు చెల్లెమ్మ ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ... తన అన్నయ్య బండారాన్ని ప్రచారంలో ప్రజల ముందు పెట్టి తీరుతానని స్పష్టం చేస్తున్నారు. ఇంత కోపం ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే... తన సోదరుడు కోట్లు గడించాడని, తన తల్లి పేరిట ఉన్న 10 సెంట్ల భూమిని తనకు ఇవ్వకుండా అమ్మే యత్నం చేయడం వల్లే ఈ ‘పగ’అని జవాబిచ్చారు. ఇదే విషయాన్ని అమ్మ(జయలలిత)కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే అన్నయ్యకు తగ్గ ప్రత్యర్థి తానేనంటూ ఆమె సెలవిచ్చారు. జయలలిత కరుణించి సీటును సింగముత్తుకే వదలి పెట్టినా, ఈ తోడ పుట్టిన చెల్లెమ్మ వదలి పెట్టేట్టు లేదంటూ సింగానల్లూరు ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు.