రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో | Actor Manoj Bajpayee Sells Apartment In Mumbai For Rs 9 Crore | Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: బాలీవుడ్ నటులు కొత్తరకం బిజినెస్

Aug 23 2024 10:25 AM | Updated on Aug 23 2024 11:03 AM

Actor Manoj Bajpayee Sells Apartment In Mumbai For Rs 9 Crore

తెలుగులో పలువురు హీరోహీరోయిన్లకు రెస్టారెంట్స్, పబ్బులు ఉన్నాయి. యాక్టింగ్ కాకుండా ఇలా బిజినెస్‌లోనూ కాలు పెడుతున్నారు. బాలీవుడ్‌లో మాత్రం యాక్టర్స్ చాలామంది కొత్త తరహా బిజినెస్‌లు చేస్తున్నారు. ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనడం.. కొన్నేళ్ల తర్వాత దాన్ని అమ్మడం, తద్వారా కోట్లలో లాభాలు అర్జించడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)

ప్రేమకథ, హ్యాపీ, పులి, వేదం తదితర తెలుగు సినిమాల్లో నటించిన మనోజ్ బాజ్‌పాయ్.. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాత హిందీలో సోలోగా మూవీస్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. అయితే పదేళ్ల క్రితం ముంబైలోని మినర్వా ప్రాంతంలో భార్యతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌ని రూ.6 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇప‍్పుడు దీన్నే రూ.9 కోట్లకు విక్రయించాడు.

కొన్నిరోజుల క్రితమే విక్రయం జరిగిందని, ఈ అపార్ట్‌మెంట్ అమ్మడం ద్వారా మనోజ్ బాజ్‌పాయ్‪‌కి దాదాపు రూ.3 కోట్లు లాభమొచ్చినట్లే. ఇదిలా ఉండగా రీసెంట్‌గా హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా తన ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇంటిని రూ.25 కోట్ల అమ్మకానికి పెట్టింది. ఖరీదైన బాంద్రా ఏరియాలో ఈ ఫ్లాట్ ఉంది. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ రెండు చేతులా సంపాదించేస్తున్నారు అనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement