పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్ | Actor Kiran Abbavaram Wedding Rahasya Gorak Latest | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: హీరోయిన్ రహస్యతో కిరణ్ వివాహం

Published Fri, Aug 23 2024 6:56 AM | Last Updated on Fri, Aug 23 2024 8:22 AM

Actor Kiran Abbavaram Wedding Rahasya Gorak Latest

తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌తో ఏడడుగులు వేశాడు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి ఈ వేడుక జరిగింది. తెలుగు సంప్రదాయంలోనే మూడు ముళ్లు వేసిన కిరణ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

(ఇదీ చదవండి: డీమాంటీ కాలనీ-2 సినిమా రివ్యూ)

'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇకపోతే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సొంతంగా నిర్మిస్తున్నాడు. అంటే నిర్మాణ బాధ్యతల‍్ని రహస్య చూసుకుంటోంది. ఇక వీళ్లి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement