
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.

ఐటం సాంగ్ ఆఫర్
అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది.
శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?
ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్‌కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment