దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్‌.. | Vadivelu Financial Help to Actor Vengal Rao Medical Treatment | Sakshi
Sakshi News home page

పక్షవాతం.. చికిత్సకు డబ్బుల్లేని దీన స్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్‌

Published Sat, Jun 29 2024 12:39 PM | Last Updated on Sat, Jun 29 2024 7:44 PM

Vadivelu Financial Help to Actor Vengal Rao Medical Treatment

ప్రముఖ కమెడియన్‌ వెంగళ్రావు దీన స్థితిలో ఉన్నాడు. తమిళంలో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఈయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు సైతం డబ్బుల్లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఒక చేయి, కాలు పక్షవాతానికి గురైందని, పని చేసే స్థితిలో లేనని, చికిత్సకు డబ్బులిచ్చి సాయం చేయాలని సినిమా తారలకు విజ్ఞప్తి చేశాడు.

కదిలిన సినీతారలు
ఇది చూసిన తమిళ హీరో శింబు రూ.2 లక్షలు, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌ రూ.25,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కమెడియన్‌ వడివేలు.. నటుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తనను నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నాడు.

వడివేలుతోనే ఎక్కువ సినిమాలు
కాగా వెంగళ్రావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో స్టంట్‌మెన్‌గా పని చేశాడు. తర్వాత నటుడిగా మారాడు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా అనేక చిత్రాలు చేశాడు. ఎక్కువగా వడివేలుతో కలిసి పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లోనే దాదాపు 30 సినిమాలున్నాయి. ప్రస్తుతం వెంగళ్రావు విజయవాడలో నివసిస్తున్నాడు.

 

చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement