పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది? | Sonakshi Sinha Father Hospitalised Video Viral | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: పెళ్లయిన వారానికే ప్రెగ్నెన్సీ రూమర్స్.. నిజమేంటి?

Published Sat, Jun 29 2024 8:37 AM | Last Updated on Sat, Jun 29 2024 9:03 AM

Sonakshi Sinha Father Hospitalised Video Viral

పెళ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆస్పత్రిలో కనిపించింది. దీంతో లేనిపోని పుకార్లు మొదలయ్యాయి. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసిందని అంటున్నారు. దీంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఇంత తొందరగానా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత?

(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?)

బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. 'దబంగ్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరసగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఇండస్ట్రీకే చెందిన జహీర్ ఇక్బాల్ అనే నటుడిని ప్రేమించి.. ఈ మధ్యనే జూన్ 23న పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది.

అయితే పెళ్లయి ఐదురోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సోనాక్షి-జహీర్ వస్తూ కనిపించారు. దీంతో ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇది అబద్ధమని తేలింది. శత్రుఘ్ని సిన్హా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌లో ఉన్నారని, తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement