తమిళ ఇండస్ట్రీలో రివ్యూలపై వివాదం నడుస్తోంది. సినిమా రిలీజ్ రోజే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకుని, ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతల మండలి చాలారోజులుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. కొన్నిరోజులు క్రితమే దీనిపై ఏకపక్షంగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు దీనిపై మద్రాసు హైకోర్టు.. సదరు నిర్మాతల మండలికి షాకిచ్చింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)
రీసెంట్‌గా తమిళంలో రిలీజైన పెద్ద సినిమా 'కంగువ'. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి రివ్యూలే కారణమని భావించిన నిర్మాతలు.. తొలిరోజు థియేటర్ల దగ్గర రివ్యూలు చెప్పనివ్వకుండా యూట్యూబర్లని నిషేధించాలని తీర్మానించించది. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు.. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరింది. దీనికి వాళ్లు కూడా ఒప్పుకొన్నారు.
ఈ నిర్ణయంపై కొందరు వ్యక్తులు.. మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. నిర్మాతల మండలి అభ్యర్థులని మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి, నష్టం వాటిల్లినట్టు ఆధారాలుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్పితే.. రివ్యూ ఇవ్వొద్దని స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. రివ్యూల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment