Tamil producers
-
తమిళ నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్ట్
తమిళ ఇండస్ట్రీలో రివ్యూలపై వివాదం నడుస్తోంది. సినిమా రిలీజ్ రోజే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకుని, ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతల మండలి చాలారోజులుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. కొన్నిరోజులు క్రితమే దీనిపై ఏకపక్షంగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు దీనిపై మద్రాసు హైకోర్టు.. సదరు నిర్మాతల మండలికి షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)రీసెంట్గా తమిళంలో రిలీజైన పెద్ద సినిమా 'కంగువ'. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి రివ్యూలే కారణమని భావించిన నిర్మాతలు.. తొలిరోజు థియేటర్ల దగ్గర రివ్యూలు చెప్పనివ్వకుండా యూట్యూబర్లని నిషేధించాలని తీర్మానించించది. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు.. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరింది. దీనికి వాళ్లు కూడా ఒప్పుకొన్నారు.ఈ నిర్ణయంపై కొందరు వ్యక్తులు.. మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. నిర్మాతల మండలి అభ్యర్థులని మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి, నష్టం వాటిల్లినట్టు ఆధారాలుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్పితే.. రివ్యూ ఇవ్వొద్దని స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. రివ్యూల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్‌లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్‌లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్‌పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై స్పందించిన అల్లు అరవింద్
తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ విడుదల ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి విడుదలకు డైరెక్ట్ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే వారసుడు మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటిచింది. తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీ డబ్బింగ్ చిత్రం కావడంతో ఈ సినిమా సంక్రాంతి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై తాజాగా తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు తెలుగు చిత్రాలు తమిళ్లో ఏ ఆటంకం లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని తమిళ దర్శక-నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే తాము కూడా తెలుగు చిత్రాలను ఇక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ విషయమై ఈ నెల 22 తమిళ నిర్మాతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాతల అభ్యంతరంపై తాజాగా ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. డబ్బింగ్ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదని అన్నారు. సినిమాకు ఎల్లలు లేవని, ఎల్లలు తీసేశామన్నారు. సౌత్ నార్త్ అనే భేదాలు లేవని, బాగున్న సినిమా ఎక్కడైన ఆడుతుందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు
వారసుడు మూవీ వివాదం ముదురుతోంది. ఇటీవల తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం టాలీవుడ్-కోలీవుడ్ మధ్య లోకల్-నాన్‌లోకల్ వార్ రచ్చకు దారి తీసేల కనిపిస్తోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా రానున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి తెలుగు చిత్రాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి రీసెంట్గా లేఖ విడుదల చేసింది. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్ తమిళనాట తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని దర్శకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. వారసుడు విషయానికి వస్తే దర్శక నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని డైరెక్టర్ సీమాన్ తెలిపారు. ఇంత జరుగుతున్న స్పందించకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
సినీ పరిశ్రమను కాపాడాలని సీఎంకు నిర్మాతల విజ్ఞప్తి
చెన్నై సినిమా : సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల మండలి నిర్వాహకులు ఆదివారం ఉదయం సమాచార శాఖ మంత్రి వెళ్లకోవిల్ సామినాథన్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూబ్ రుసుమును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తమిళ్ అభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్ కాశీరాజు నుంచి, సమాచారశాఖ డైరెక్టర్ వీపీ.జయశీలన్, తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామసామి తదితరులు పాల్గొన్నారు. -
తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా
‘‘ఆమె’ సినిమాకి మంచి పేరు వచ్చింది.. కానీ, కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు. కలెక్షన్లు రాకపోవడంతో అన్యాయం జరిగిందని చెప్పడం లేదు’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అమలాపాల్ లీడ్ రోల్లో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రాంబాబు కల్లూరి, విజయ్ మోరవనేని ‘ఆమె’ పేరుతో ఈ నెల 20న తెలుగులో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతలకు నెల కిందటే ‘ఆమె’ కోసం డబ్బులు చెల్లించాం. తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చారు. అయితే ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బు కట్టలేదు. చివరకు అమలాపాల్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడంతో పాటు ఎదురు డబ్బులు ఇచ్చి విడుదల చేయించింది. ముందుగా అనుకున్నట్లు 19న విడుదలైతే బాగుండేదేమో? ఒక రోజు ఆలస్యంగా విడుదల కావడం వల్ల క్రేజ్ తగ్గిపోయి మా చిత్రం చచ్చిపోయింది. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ అవుతున్న సినిమా చంపేయబడింది. సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నారు. నాకు దొరికినా తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా. దీనిపై తెలుగు ఫిల్మ్ చాంబర్లో కేసు పెట్టా. ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పద్ధతిగా విడుదల చేయడం కూడా అంతే ముఖ్యమనే పాఠాన్ని ‘ఆమె’తో నేర్చుకున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... నేటితరం ఆవేశంలో, మద్యం మత్తులో విసిరే సవాళ్లు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని అసభ్యత లేకుండా తీశాడు దర్శకుడు. అమలాపాల్ బాగా నటించింది. ‘మల్లేశం, ఆమె’ లాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు. -
షూటింగ్‌లకు రండి.. రాయితీలు ఇస్తాం
చెన్నై: మారిషస్ వచ్చి మూవీ షూటింగ్స్ జరిపితే భారతీయ సినిమాలకు భారీ రాయితీలు కల్పిస్తామని మారిషస్ ఫిలిం డెవలప్ మెంట్ అధికారులు ఆహ్వానించారు. మారిషస్ దేశం ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెన్నైకి వచ్చి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలి కోశాధికారి ఎస్ఆర్ ప్రభు, ప్రధాన కార్యదర్శి జ్ఞానవేల్‌రాజా మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. తమ దేశంలో షూటింగ్‌లు చేసుకోవడానికి రావాలని, ఆ మూవీలకు 45 శాతం రాయితీ కల్పిస్తామని మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెప్పారు. సానుకూలంగా స్పందించిన తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు తమ నిర్మాతల అందరితో సంప్రదించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రాయితీల విషయాన్ని నిర్మాతలకు వివరిస్తామని పేర్కొన్నారు. మారిషస్ లోని గ్రాండ్ బే బీచ్ (ఫైల్) -
కార్తీక్ సుబ్బరాజ్‌పై నిర్మాతల గుర్రు
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌పై తమిళ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై రెడ్‌కార్డ్ వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. పిజ్జా, జిగరతండా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్. ఈయ న ఆది నుంచి వివాదాలను ఎదుర్కొంటున్నారు. జిగర్తండా చిత్రం నిర్మాణ సమయంలో ఆ చిత్ర నిర్మాతతో భేదాభిప్రాయాలు సంచలనం కలిగించాయి. తాజాగా ఇరైవి చిత్రంతో మరో సారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. విజయ్‌సేతుపతి, ఎస్జే.సూర్య, బాబీ సింహ, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరై వి. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, సీవీ.కుమార్ నిర్మిం చారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఇరైవి చిత్ర రిజల్ట్ ఎలా ఉందన్నది పక్కన పెడితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తమిళ నిర్మాతలను అవమాన పరచేవిగా ఉన్నాయంటూ పలు నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు. నిర్మాత సురేశ్‌కామాక్షి, పిఎల్.తేనప్పన్ వంటి నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్కు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిర్మాత ఈగో కారణంగా చిత్ర నిర్మాణం నిలిచిపోయిందనే సన్నివేశాలతో సినీ నిర్మాతలను అవమాన పరిచేవిధంగా ఇరైవి చిత్రంలో సన్నివేశాలు చోటు చేసుకున్నాయని,ఈ చిత్ర నిర్మాతలు జ్ఞానవేల్‌రాజా, సీవీ.కుమార్ కథ తెలియకుండా ఇరైవి చిత్రాన్ని నిర్మించి ఉండరని, అందువల్ల ఈ విషయంలో వారిని కూడా ప్రశ్నించాలని తమిళ నిర్మాతల మండలిపై ఒత్తిడి పెరుగుతోంది. సోమవారం తమిళ నిర్మాతల సంఘం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇరైవి చిత్ర వివాదం గురించి చర్చించారు. సమావేశంలో పలువురు నిర్మాతలు కార్తీక్సుబ్బరాజ్పై రెడ్‌కార్డ్ వేయాలని డిమాండ్ చేశారు.అ యితే ఒక దర్శకుడిపై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ వేయలేదని,ఈ అంశాన్ని దర్శకుల సంఘానికి వదిలిపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్తీక్‌సుబ్బరాజ్ వివా దం దర్శకుల సంఘం కోర్డుకు చేరినట్లు తెలిసింది. ఆ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.