
చెన్నై సినిమా : సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల మండలి నిర్వాహకులు ఆదివారం ఉదయం సమాచార శాఖ మంత్రి వెళ్లకోవిల్ సామినాథన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూబ్ రుసుమును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో తమిళ్ అభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్ కాశీరాజు నుంచి, సమాచారశాఖ డైరెక్టర్ వీపీ.జయశీలన్, తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామసామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment