Tamil movie industry
-
31 ఏళ్ల తర్వాత వారిద్దరి కాంబోలో మరో సినిమా!
తమిళ సినిమా: లెజెండరీ దర్శకుడ భారతీరాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా 31 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక చిత్రంలో కలిసి పని చేయడం విశేషం. వీరి కాంబినేషన్లో చివరిగా నాడోడి తెండ్రల్ చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దర్శకుడు సుశీంద్రన్ తన వెన్నెల ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న మార్గళి తింగల్ చిత్రంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు, నటుడు మనోజ్ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన తాజ్ మహల్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన మనోజ్ మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే తన తండ్రిని డైరెక్ట్ చేయడం విశేషం. భారతీరాజా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించి దర్శకుడు సుశీంద్రన్ తెలుపుతూ నటుడు మనోజ్ భారతీరాజాను తన చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అదనపు బలం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రం పాటల రికార్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి చిత్రంతోనే తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని మనోజ్ పేర్కొన్నారు. -
హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు
చెన్నై సినిమా: కోలీవుడ్ హీరో విమల్ చీటింగ్ చేశారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన్నన్ వగైయారా. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి తనను మోసం చేశారని విమల్‌పై నిర్మాత గోపి గత వారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ కూడా కంప్లైట్ ఇచ్చారు. తాజాగా మరో నిర్మాత గణేశన్ కూతురు హేమ మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో నటుడు విమల్ పై రూ. 1.74 కోట్లు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అందులో తిరుప్పూర్‌కు చెందిన తమ కుటుంబం మాంసం విక్రయం వృత్తి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎదిగిందని పేర్కొన్నారు. కాగా సినిమా అంటే వ్యామోహం కలిగిన తన తండ్రి గణేశన్.. విమల్ హీరోగా మన్నర్ వగైయారా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. అలా ప్రారంభమైన చిత్ర షూటింగ్ హీరో హీరోయిన్ల మధ్య విభేదాల కారణంగా నిలిచిపోవడంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిందన్నారు. దీంతో తన తండ్రి చిత్ర నిర్మాణం నిలిపేసి ఊరికి తిరిగొచ్చేశారని, ఆ తరువాత విమల్ తమ తండ్రిని కలిసి చిత్రాన్ని తానే నిర్మిస్తానని, మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ రాశారన్నారు. అయినా తమ డబ్బు చెల్లించకపోవడంతో తాము చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీంతో విమల్ తమను కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, పిటిషన్‌ను వాపస్ తీసుకోమని కోరారన్నారు. చిత్రం విడుదలైనా తమకు నగదు చెల్లించకపోగా చిత్ర తెలుగు అనువాద హక్కులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని తమ రూ.1.74 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1631343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీనియర్ నటుడు చక్రవర్తి కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ తమిళ నటుడు చక్రవర్తి శనివారం ఉదయం ముంబయిలో గుండెపోటుతో మరణించాడు. ఈయన వయసు 62 ఏళ్లు. 1980 ప్రాంతంలో ప్రముఖ నటుడిగా రాణించిన ఈయన తమిళంలో వివిధ పాత్రల్లో 80 చిత్రాల వరకు చేశారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. శివాజీ గణేశన్ కథానాయకుడు నటించిన రిషి మూలం చిత్రం ద్వారా చక్రవర్తి నటుడిగా పరిచయమయ్యారు. కొంతకాలం తరువాత సినిమాలకు దూరమై ముంబయికి వెళ్లిపోయారు. అక్కడ సోనీ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో పని చేశారు. ఈయన దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కాగా శనివారం ఉదయం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆయన సతీమణి ఉదయాన్నే లేపినా లేవకపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్రవర్తి గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు తెలిపారు. ఈయనకు భార్య లలిత, శశికుమార్, అజయ్‌కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చదవండి: (వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం) -
పరీక్షల్లో ఫెయిల్ అయితే.. వినోదాత్మకంగా 'బీఈ బార్'
చెన్నై సినిమా: పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న తమిళ చిత్రం 'బీఈ బార్'. 'కావల్ తురై ఉంగళ్ నన్బన్' వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించిన టీమ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. 'కావల్ తురై ఉంగళ్ నన్బన్' మూవీ ఫేమ్ సురేష్ రవి కథానాయకుడి గానూ, 'చతురంగ వేట్టై' సినిమా ఫేమ్ ఇషార నాయకి గాను నటిస్తున్న ఇందులో తంబి రామయ్య, లివింగ్ట్సన్, కల్లూరి వినోద్, మధు, రేణుక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.డీ.ఎమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శ్రీ.కె.ఎస్, ఆదిత్య అండ్ సూర్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను అబ్జల్యూట్ పిక్చర్స్ తరపున మాల్గమ్, బీఆర్ టాకీస్ కార్పొరేషన్, వైట్ మూన్ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడానికి పడే పాటులను వినోదభరితంగా చూపిస్తున్నట్లు తెలిపారు. -
సినీ పరిశ్రమను కాపాడాలని సీఎంకు నిర్మాతల విజ్ఞప్తి
చెన్నై సినిమా : సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తమిళ సినీ నిర్మాతల మండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా నిర్మాతల మండలి నిర్వాహకులు ఆదివారం ఉదయం సమాచార శాఖ మంత్రి వెళ్లకోవిల్ సామినాథన్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూబ్ రుసుమును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తమిళ్ అభివృద్ధి, సమాచార శాఖ కార్యదర్శి మహేశన్ కాశీరాజు నుంచి, సమాచారశాఖ డైరెక్టర్ వీపీ.జయశీలన్, తమిళ్ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్.రామసామి తదితరులు పాల్గొన్నారు. -
కథానాయకుడిగా ఆ దర్శకుడి మరో ప్రయత్నం..
చైన్నై సినిమా: దర్శకుడు అమీర్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం అమీర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేశారు. తన అమీర్ ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థ, జేఎస్ఎమ్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తనతో పాటు నటుడు ఆర్య సోదరుడు సత్య మరో కథానాయకుడిగా నటించనున్నట్లు చెప్పారు. నటి సంచితా శెట్టి హీరోయిన్గా కాగా విన్సెంట్ అశోక్, దినా, చరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తారని తెలిపారు. రాంజీ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారని పేర్కొన్నారు. 'అధర్మం, పగైవన్' చిత్రాల ఫేమ్ రమేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తారన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. -
విలన్‌గా మారిన దర్శక నిర్మాత
సినీరంగంలో ఒక శాఖలో పేరు తెచ్చుకున్న వ్యక్తి మరో శాఖలో ప్రవేశించడం సులభమే. అయితే అన్ని శాఖల్లోనూ రాణించడం అంత సులభం కాదు. అలాంటిది పదమ్ కుమార్ మాత్రం ఇందుకు అతీతం అనే చెప్పాలి. ఈయన ప్రముఖ ఛాయాగ్రాహకుడు. అంతేకాకుండా భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత కూడా. అంతకుమించి పదమ్ కుమార్ తండ్రి హెచ్ఎస్.వేణు దివంగత ప్రఖ్యాత దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలకు ఛాయాగ్రహణ అందించారు. కాగా పదమ్ కుమార్ కూడా హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలకు చాయాగ్రాహకుడిగా పనిచేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన దక్షిణాది చిత్రాలకు ఈయన నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. అలా 2014లో నాని, వాణీకపూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ఆహా కళ్యాణం పదం కుమార్ నిర్మాణ సారథ్యంలోనే రూపొందింది. అదేవిధంగా తమిళ్లో శింబు, వరలక్ష్మి జంటగా నటించిన పోడాపోడీ చిత్రాన్ని నిర్మించి నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈయనే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని మొదటిసారిగా సినిమాకు పరిచయం చేసిన నిర్మాత కూడా పదమ్ కుమార్‌నే. ఈయన కథా రచయిత కూడా. అన్ని శాఖల్లో ప్రావీణ్యం కలిగిన పదమ్ కుమార్ తాజాగా నటుడి అవతారమెత్తారు. ఇటీవల ఓటీటీలో వడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న పావ కథైగళ్ సిరీస్‌లో నిలవ్ పన్న ఉట్రనుమ్ సెగ్మెంట్లో విలన్ పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకున్నారు. విశేషమేంటంటే తాను దర్శకుడిగా పరిచయం చేసిన విఘ్నేష్ శివన్నే పదమ్ కుమార్‌ను ఈ సిరీస్ ద్వారా నటుడిగా పరిచయం చేశారు. -
విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు!
సాక్షి, చెన్నై : నటి మీరామిథున్ తన వివాదస్పద వ్యాఖ్యలకు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ మధ్య హీరోలు విజయ్, సూర్యలను వ్యక్తిగతంగా విమర్శలు చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా మీరామిథున్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అయినా నటి మీరామిథున్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవలే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో వివాదస్పద అంశానికి తెర తీశారు. ఈసారి విశాల్‌ను టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మేనేజర్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అందులో విశాల్ తనను పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఏళ్లుగా అడుగుతూ వచ్చారని మీరా మిథున్ పేర్కొన్నారు. తన తల్లికి విశాల్ అంటే చాలా ఇష్టమని, అయితే తనకు ధనవంతుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే విశాల్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు తెలిపారు. మరి దీనికి విశాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
నన్ను చాలా టార్చర్ చేశారు
తనను చాలా టార్చర్‌కు గురి చేశారని నటి విద్య ప్రదీప్ ఆరోపించింది. అవళ్ పేర్ తమిళరసి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి విద్య ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రల్లో నటించింది. అలా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన శైవం చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పసంగ–2, మారి–2, తడం, ఫోన్ మగళ్ వందాల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఒత్తైక్కు ఒత్త, అసుర కులం, తలైవి వంటి చిత్రాల్లో నటిస్తోంది. కాగా రాక్ టౌన్ కాలనీ నటీమణులు తమ అనుభవాలను, ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తు చేకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చాలామందిని కలవర పెట్టింది. ఈ సందర్భంగా నటి విద్యా ప్రదీప్ తన ట్విట్టర్లో పేర్కొంటూ తానూ ఈ రంగంలో చాలా టార్చర్‌కు గురైనట్లు చెప్పింది. ఒకే సారి వరుసగా ఆరు చిత్రాల అవకాశాలను కోల్పోయినట్లు తెలిపింది. సంబంధంలేని కారణాలతో తనను తొలగించారని వాపోయింది. ఆ సమయంలో తన గుండె పగిలిపోయినంత బాధ కలిగినట్లు చెప్పింది. దీంతో తనకు సినిమా సరిపడదని భావించి చదువుపై దృష్టి సారించినట్లు తెలిపింది. అలాంటి సమయంలో తడం చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. చదవండి: కొంతగ్యాప్ తర్వాత? కొందరు మిత్రులు దర్శకుడు మగిళ్ తిరువేణి గురించి చెప్పడంతో తడం చిత్రంలో భయపడుతూనే నటించానని చెప్పింది. అయితే ఆ చిత్రంలో దర్శకుడు మగిళ్ తిరువేణి తనలోని నటిని బయటికి తీశారని తెలిపింది. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని తనలాంటి వారు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని, ఎవరు పట్టించుకోరని కూడా చెప్పింది. నిర్మాతలు తలుచుకుంటే ఏమైనా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మనమీద మనకు నమ్మకం ఉంటే కఠిన శ్రమతో విజయాన్ని సాధించవచ్చని చెప్పింది. అలాంటి ఒక చిన్న విజయం కూడా గర్వపడేలా చేస్తోందని అంది. చదవండి: మహాసముద్రంలో ఆ ముగ్గురు -
19 నుంచి తమిళ చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్
తెలుగు చిత్రాల షూటింగ్స్ని ఆపివేయాలని ఆదివారం తెలుగు ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ చిత్రాల షూటింగ్స్ కూడా ఆగిపోనున్నాయి. ఈ నెల 19 నుంచి షూటింగ్స్ని ఆపివేస్తామని ‘ఫెఫ్సీ’ (దక్షిణ చలన చిత్ర కార్మికుల సమాఖ్య) సోమవారం ప్రకటించింది. ‘‘భారీ నష్టం జరుగుతుంది. అయితే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. నిర్ణయాలకు కట్టుబడాలి. మా కార్మికుల క్షేమమే మాకు ముఖ్యం. నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరూ మా నిర్ణయాన్ని ఆమోదించి ఈ 19 నుంచి షూటింగ్స్ ఆపివేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ‘ఫెఫ్సీ’ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల చిత్రీకరణను కూడా నిలిపివేయమని కోరారు. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలుపెట్టాలన్నది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని కూడా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విక్రమ్ ‘కోబ్రా’, అజిత్ ‘వలిమై’, శింబు ‘మానాడు’ చిత్రాల విదేశీ షెడ్యూల్స్ రద్దయ్యాయి. అన్ని చిత్రాల షూటింగ్స్ నిలివేయాలని సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తెలుగు స్టూడియోలు ఖాళీగా ఉన్నట్లే తమిళ స్టూడియోలు కూడా ఖాళీగా ఉండబోతున్నాయి. -
బాలీవుడ్‌కు సూపర్ డీలక్స్
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన చిత్రాల్లో ‘సూపర్ డీలక్స్’ ఒకటి. త్యాగరాజ కుమారరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహద్ ఫాజల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. విజయ్ సేతుపతి, సమంత పోషించిన పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రైట్స్ తీసుకుందని టాక్. ఈ రీమేక్‌ను కూడా త్యాగరాజ కుమారరాజానే డైరెక్ట్ చేస్తారని తెలిసింది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ టాప్ స్టార్స్ కనిపిస్తారని సమాచారం. -
తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ!
ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలు మాత్రమే చేసిన మంచు విష్ణు ఇప్పుడు తమిళంపై కూడా దృష్టి పెట్టారు. ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం గురువారం ప్రారంభమైంది. విష్ణు, సురభి జంటగా జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై సుధీర్‌కుమార్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు మోహన్‌బాబు క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నిర్మించనున్న ఐదో చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం. ఈ చిత్రం ద్వారా విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు’’ అని తెలిపారు. సంపత్‌రాజ్, పోసాని, నాజర్, ప్రగతి,బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల. -
నం.1 నయనతారే!
సంచలన తారగా పేరొందిన నటీమణుల్లో ముందుండే నటి నయనతారనే అనక తప్పదు. చిత్ర పరిశ్రమలో చాలా మంది జయించడం లేదు. ముఖ్యంగా కథానాయికలు వరుసగా అవకాశాలను పొందడంలో విఫలం అవుతున్నారు. ఇక వేరే అవకాశాలు పొందినా వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం లేదు. అలాంటిది పదేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి నయనతార అని చెప్పడంలో అవాస్తవం ఉండద నుకుంటా. సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ పలు ఆటంకాలను, అనేక సమస్యలను ఎదురొడ్డి ఆ ప్రభావాలను తన నటనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రముఖ నటిగా భాసిల్లుతున్న నటి నయనతార. అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలోకి దిగుమతి అయిన కేరళ కుట్టి నయన. ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తనదైన నటనా ప్రతిభతో అభిమానుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇక నయనతార నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్న పేరును సంపాదించుకున్నారు. దీంతో దర్శక నిర్మాత ఆమె చుట్టూ తిరుగుతుంటే ప్రముఖ హీరోల నుంచి యువ నటుల వరకూ నయనతార తమకు జంటగా నటించాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన దక్షిణాది అగ్ర కథానాయికి ఎవరన్న చర్చావేదికలో అగ్రస్థానం నయననే వరించింది. నయనతార అందం, అభినయాలను ఇష్టపడుతున్నట్లు అధిక సంఖ్యలో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2013లో చర్చావేదికలో 7వ స్థానంతోనే సరిపెట్టుకున్న నయనతార ఇప్పుడు ప్రథమ స్థానానికి ఎగబాకడం విశేషమే. ఇక రెండో స్థానంలో నటి శ్రుతిహాసన్ నిలువగా, మూడో స్థానాన్ని ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్, నాలుగు, ఐదు స్థానాల్లో అనుష్క, తమన్న దక్కించుకున్నారు. ఇక త్రిష, హన్సిక ఆ తరువాత స్థానాలకే పరిమితమయ్యారు. -
మూగబోయిన సంగీత ఝరి
చెన్నైలో ఎంఎస్ విశ్వనాథన్ మృతి సినీ పరిశ్రమ అశ్రు నివాళి తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి సినీలోకం అశువులు బాసింది. నెల రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ విశ్వనాథన్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. భారతీయ సినిమా అపర సంగీత చాణుక్యుడు ఎం ఎస్ విశ్వనాథన్. ఎం అంటే మహా ఎస్ అంటే సంగీతం. విశ్వనాథన్ సొంతం. 70 వసంతాలకు పైగా సంగీత కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ సరిగమలతో జతులుకడుతూ తాను ఎదుగుతూ సంగీత మాధుర్యాన్ని ఇతరులకు పంచుతూ సంగీత కుటుంబాన్ని పెంచుతూ సంగీత రారాజుగా మన్ననలను అందుకున్న ఎం ఎస్ విశ్వనాథన్‌ను అమరజీవి అయ్యారు. అయినా సంగీత పిపాసి చిరంజీవినే. తమిళ సినిమా సంగీత చక్రవర్తి అంటూ సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే 2012లో బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణేలతో పాటు కారును బహూకరించారు. బాల్యం : మెల్లిసై మన్నర్ (ది కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) బిరుదాంకితుడైన ఎం ఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలోని ఎలపుల్లి గ్రామంలో జన్మించారు. మనయాంగల్ సుబ్రమణియన్, నారాయణి కుట్టి తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఎంఎస్‌కు పితృయోగం కలిగింది. దీంతో విరక్తి చెందిన తల్లి ఎంఎస్‌ను చంపి తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎస్ తాత సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఎంఎస్‌కు చదువుల తల్లి దగ్గరవ్వలేదు. సంగీతంపై ఆసక్తి కనబరచడంతో నీలకంఠం భాగవతార్ వద్దకు పంపారు. ఆయన వద్ద మూడేళ్లు సంగీతంలో సాధన చేశారు. అలా 13 ఏళ్ల వయసులోనే నిర్విరామ సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంఎస్‌కు నటనపైనా మక్కువే. తాత జైలు వార్డెన్ కావడంతో జైలు రోజున ఖైదీలతో హరిచంద్రనాటకం వేయించారు. అందులో ఎం ఎస్ లోహితుడిగా నటించి అదరగొట్టేశారు. మద్రాస్ పయనం: అది 1941వ సంవత్సరం విజయదశమి పర్వదినం మేనమామ సహాయంతో ఎం ఎస్ విశ్వనాథన్ మద్రాస్ మహానగరంలో కాలు మోపారు. జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం.సుందరం శెట్టియార్, మొహిద్దీన్ చిత్రం నిర్మించ తలపెట్టారు. అందులో ఒక పాత్ర కోసం ఎం ఎస్‌కు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆయన ఆ పాత్రకు నప్పకపోవడంతో తరువాత చూద్దాం అంటూ చేతులు దులిపేశారు. పరిస్థితి పాలుపోని ఎంఎస్ వారిని బ్రతిమలాడుకుని వారి కార్యాలయంలోనే బాయ్‌గా చేరారు. ఆ తరువాత ఆ సంస్థ నిర్మించిన కుబేర కుశలుఅనే చిత్రంలో సైనికుడిగా నటించారు. అయితే నటుడిగా తాను పనికి రానని గ్రహించి సంగీత రంగంపై దృష్టి సారించారు. సేలం మోడ్రన్ థియేటర్స్ సంస్థలు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలిశారు. ఎంఎస్ విశ్వనాథన్‌తో ఒక పాట పాడించుకున్న మహదేవన్ ఆయనలోని ప్రతిభను గ్రహించి సెంట్రల్ స్టూడియోకు వెళ్లు పని దొరుకుతుందని చెప్పారు. ఎంఎస్ నేరుగా సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడిని కలిశారు. అంతే ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత సీఆర్ సుబ్బరాయన్ సంగీత ట్రూప్‌లో చేరారు. అక్కడ టీకేరామమూర్తితో పరిచయం ఏర్పడింది. 1952లో సీఆర్ సుబ్బరాయన్ మరణించడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న దేవదాస్, చండీరాణి చిత్రాలను పూర్తి చేసే బాధ్యతలను ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి నిర్వహించారు. అలా ఆ చిత్రాల విజయాలతో ఎం ఎస్ విశ్వనాథన్ జెనోవా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర కథా నాయకుడు ఎంజీఆర్ కావడం విశేషం. రామమూర్తి విశ్వనాథన్‌ల ద్వయం : ఆ తరువాత నిర్మాత టీకే కల్యాణం తన చిత్రం పణంకు రామమూర్తి విశ్వనాథన్‌లను కలిపి సంగీతం అందించమని చెప్పారు. అలా మొదలైన ఆ సంగీత ద్వయం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 700 చిత్రాల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. మొత్తం 1200 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఎం ఎస్ది. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య పేరు జానకి అమ్మన్. వీరికి గోపికృష్ణ, మురళీధరన్, ప్రకాష్, హరిదాస్ అనే నలుగురు కొడుకులు. లతా మోహన్, మధు ప్రసాద్, శాంతికుమార్ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చెన్నై శాంతోం రోడ్డులో నివసిస్తున్న ఎంఎస్ విశ్వనాథన్ కుటుంబం నివశిస్తోంది. ఎం ఎస్ విశ్వనాథన్ భౌతిక కాయానికి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు ఎంఎస్ అంత్యక్రియల కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దయ్యాయి. సీఎంల చిత్రాలకు సంగీతం : ముఖ్యమంత్రులుగా తమిళ, తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన, పాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నటించిన పలు చిత్రాలకు ఎం ఎస్ విశ్వనాథన్ సంగీతం పక్క బలాన్నిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితోను ఎంఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. గాయకులకు పేరు ప్రఖ్యాతులు : ఎం ఎస్ విశ్వనాథన్ చాలామంది గాయనీ గాయకులకు పేరు ప్రఖ్యాతులు అందించారు. నేటి ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్ఆర్ ఈశ్వరి, టీఎం సౌందరరాజన్, కేజే ఏసుదాస్ మొదలగు వారందరూ ఎం ఎస్ సంగీతంలో ఆలపించి ప్రశంసలందుకున్న వారే. నటుడు, గాయకుడు కూడా: ఎం ఎస్ గొప్ప సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు కూడా. ఆయన తన చిత్రాలతో పాటు ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లోనూ పాడారు. మొత్తం 500లకు పైగా పాటలను పాడారు. ఇక చిన్నతనంలో నటుడవ్వాలన్న కోరికను ప్రముఖ సంగీత దర్శకుడైన తరువాత తీర్చుకున్నారు. కాదల్‌మన్నన్ చిత్రంలో ఎంఎస్ తొలిసారిగా హాస్యపాత్రలో అలరించారు. ఆ తరువాత కాదలా కాదలా తదితర 10 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డులు లేవు కాని.... ఎం ఎస్ విశ్వనాథన్ జాతీయ అవార్డులకు అలంకారం అయ్యే అవకాశాన్ని పొందలేదు గాని ఆయనికి అంతకం టే గొప్ప అవార్డులే వరించాయి. 1963 జూలై 16న గీత రచయిత కన్నదాసన్, దర్శకుడు శ్రీధర్, నటుడు జెమినీ గణేశన్, చంద్రబాబు చిత్రాలయ గోపుల సమక్షంలో శి వాజీ గణేశన్ రామమూర్తి, విశ్వనాథన్‌లకు మెల్లిసై మ న్నన్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. కలైమామణి, ఫిలింఫేర్ లాంటి పలు బిరుదులు ఎం ఎస్‌ను వరించా యి. అన్నింటికంటే పెద్ద బిరుదు సంగీత ప్రియులు ఎం ఎస్‌ను గుండెల్లో స్థిరస్థాయిగా నింపుకున్నారు. సంగీతం ఉన్నంత కాలం ఎంఎస్ విశ్వనాథన్ చిరంజీవినే. -
కల నెరవేరిందా?
తమిళ చిత్రపరిశ్రమలో ‘మీకు ఏ హీరో సరసన నటించాలని ఉంది’ అని అడిగితే.. ఎక్కువమంది హీరోయిన్లు చెప్పే పేరు ‘అజిత్’. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హన్సిక కూడా ఇదే సమాధానం చెప్పారని చెన్నయ్ టాక్. ఆమె అలా అన్నప్పుడు తథాస్తు దేవతలు దీవించేశారేమో..! ఎందుకంటే హన్సిక కల త్వరలో నెరవేరనుందట. ప్రస్తుతం అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత శివ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారట. ఇందులో విద్యాబాలన్‌ని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్త ప్రచారమైంది. అయితే అది నిజం కాదట. తాజాగా, హన్సిక పేరు వినిపిస్తోంది. అజిత్ సరసన ఈ బ్యూటీని దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.