
నటి విద్య ప్రదీప్
తనను చాలా టార్చర్‌కు గురి చేశారని నటి విద్య ప్రదీప్ ఆరోపించింది. అవళ్ పేర్ తమిళరసి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి విద్య ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రల్లో నటించింది. అలా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన శైవం చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పసంగ–2, మారి–2, తడం, ఫోన్ మగళ్ వందాల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఒత్తైక్కు ఒత్త, అసుర కులం, తలైవి వంటి చిత్రాల్లో నటిస్తోంది. కాగా రాక్ టౌన్ కాలనీ నటీమణులు తమ అనుభవాలను, ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తు చేకుంటున్నారు.
ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చాలామందిని కలవర పెట్టింది. ఈ సందర్భంగా నటి విద్యా ప్రదీప్ తన ట్విట్టర్లో పేర్కొంటూ తానూ ఈ రంగంలో చాలా టార్చర్‌కు గురైనట్లు చెప్పింది. ఒకే సారి వరుసగా ఆరు చిత్రాల అవకాశాలను కోల్పోయినట్లు తెలిపింది. సంబంధంలేని కారణాలతో తనను తొలగించారని వాపోయింది. ఆ సమయంలో తన గుండె పగిలిపోయినంత బాధ కలిగినట్లు చెప్పింది. దీంతో తనకు సినిమా సరిపడదని భావించి చదువుపై దృష్టి సారించినట్లు తెలిపింది. అలాంటి సమయంలో తడం చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. చదవండి: కొంతగ్యాప్ తర్వాత?
కొందరు మిత్రులు దర్శకుడు మగిళ్ తిరువేణి గురించి చెప్పడంతో తడం చిత్రంలో భయపడుతూనే నటించానని చెప్పింది. అయితే ఆ చిత్రంలో దర్శకుడు మగిళ్ తిరువేణి తనలోని నటిని బయటికి తీశారని తెలిపింది. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని తనలాంటి వారు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని, ఎవరు పట్టించుకోరని కూడా చెప్పింది. నిర్మాతలు తలుచుకుంటే ఏమైనా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మనమీద మనకు నమ్మకం ఉంటే కఠిన శ్రమతో విజయాన్ని సాధించవచ్చని చెప్పింది. అలాంటి ఒక చిన్న విజయం కూడా గర్వపడేలా చేస్తోందని అంది. చదవండి: మహాసముద్రంలో ఆ ముగ్గురు