
బాలీవుడ్ నటి అంకిత లోఖండే గతంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రేమించింది. దాదాపు ఆరేళ్లపాటు రిలేషన్‌లో ఉన్న వీరు 2016లో విడిపోయారు. అనంతరం అంకిత..విక్కీజైన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సుశాంత్.. రియా చక్రవర్తితో లవ్‌లో పడ్డాడు. కానీ కొంతకాలానికే డిప్రెషన్‌తో 2020లో తనువు చాలించాడు. ఈ మధ్య హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌కు భర్తతో కలిసి వెళ్లింది అంకిత లోఖండే. హౌస్‌లో ఉన్ననాళ్లూ పోట్లాటలతోనే గడిపారు. బయటకు వచ్చాక మాత్రం మామూలైపోయారు.
ఆఖరికి సొంత అత్త కూడా..
అయితే హౌస్‌లో ఉన్నప్పుడు తరచూ సుశాంత్ గురించి మాట్లాడింది అంకిత. ఇది చూసిన నెటిజన్లు.. సుశాంత్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే అతడి పేరు వాడుకుంటోందని విమర్శించారు. అంత ప్రేముంటే ఎందుకు విడిపోయిందో.. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం అవసరమా? సింపతీ కోసమే ఇలా చేస్తోందని ట్రోల్ చేశారు. ఆఖరికి ఆమె సొంత అత్తయ్య కూడా అదే మాట అనడంతో అగ్గిమీద గుగ్గిలమైంది నటి. తనకంలాంటి సింపతీ అక్కర్లేదని చెప్పింది.
నా లైఫ్ నా ఇష్టం..
తాజాగా మరోసారి ఈ అంశంపై మాట్లాడుతూ.. 'నా జీవితం నా ఇష్టం. నాకెవరైనా తెలిసినా.. వారి గురించి ఏదైనా మంచి విషయాలు తెలిసున్నా వాటిని బయటకు చెప్తూ ఉంటాను. దాన్ని ఎవరూ ఆపలేరు. మీరు తిట్టుకోండి.. ఏమైనా చేసుకోండి.. నాకవసరమే లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా అంకిత.. బిగ్‌బాస్ 17వ సీజన్ థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న ఊరుపేరు భైరవకోన.. టాప్‌లో ట్రెండింగ్!
Comments
Please login to add a commentAdd a comment