చైన్నై సినిమా: దర్శకుడు అమీర్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం అమీర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేశారు. తన అమీర్ ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థ, జేఎస్‌ఎమ్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తనతో పాటు నటుడు ఆర్య సోదరుడు సత్య మరో కథానాయకుడిగా నటించనున్నట్లు చెప్పారు. నటి సంచితా శెట్టి హీరోయిన్‌గా కాగా విన్సెంట్ అశోక్, దినా, చరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తారని తెలిపారు. రాంజీ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారని పేర్కొన్నారు. 'అధర్మం, పగైవన్' చిత్రాల ఫేమ్ రమేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తారన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
Director Ameer: కథానాయకుడిగా ఆ దర్శకుడి మరో ప్రయత్నం..
Published Tue, Dec 7 2021 9:49 AM | Last Updated on Tue, Dec 7 2021 10:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment