భారత్‌ నుంచి ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయిన చిత్రాలు ఇవే | Here's The List Of South Indian Movies That Were Shortlisted For Oscar 2025 Awards, Deets Inside | Sakshi
Sakshi News home page

Oscar Nominated Telugu Movies: భారత్‌ నుంచి ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయిన చిత్రాలు ఇవే

Published Tue, Sep 24 2024 8:52 AM | Last Updated on Tue, Sep 24 2024 4:29 PM

South Indian Movies Nominated 2025 Oscar

ఆస్కార్‌ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్‌ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్‌, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ చేసింది. ఈమేరకు ఇండియన్‌ ఫిలిం ఫెడరేషన్‌ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్‌' ఎంపికైనట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా  అధికారికంగా ప్రకటించింది. భారత్‌ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో  లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.

అస్కార్‌ కోసం ఈసారి ఎక్కువగా సౌత్‌ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్‌ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్‌,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్‌ హీరోగా నటించిన తంగలాన్‌, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్‌, ఎస్‌జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్‌ఎక్స్‌, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్‌ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి.  

మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్‌ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్‌ కోసం నామినేట్‌ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్‌ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement