Mangalavaaram Movie
-
బాయ్‌ఫ్రెండ్‌కు బర్త్ డే విషెస్.. పాయల్ రాజ్‌పుత్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్‌తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మరో ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కించుకుంది. ‘మంగళవారం’కథేంటంటే..ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. -
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
'ఆర్ఎక్స్ 100'తో తెలుగువారికి దగ్గరైంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం. అయితే, తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పాయల్ విచారం వ్యక్తం చేసింది. 2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు ఎన్నో సీరియల్స్లలో నటించిన ఆమె 'చన్నా మేరేయా' పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ చిత్రం పాయల్‌కు విజయాన్ని అందించింది. అలా 'ఆర్ఎక్స్ 100'తో టాలీవుడ్లో అడుగుపెట్టి ఇక్కడ కూడా భారీ హిట్‌ను అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఆమెకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100'తో మెప్పించిన పాయల్.. గతేడాది విడుదలైన 'మంగళవారం' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలెంజింగ్‌గా నటించింది. ఇలాంటి పాత్రలు చేసేందుకు చాలామంది హీరోయిన్స్ అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. కానీ పాయల్ దుమ్మురేపింది. 'మంగళవారం' ఆమె కెరీర్లో ఒక ప్రత్యేకత గల పాత్రగా మిగులుతుంది. ఆ విజయమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది.'2019-2020 సమయంలో నేను 'రక్షణ' అనే సినిమాను ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ '5Ws'. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. కానీ, రీసెంట్గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం నేను కూడా అందుబాటులో లేను. కానీ నా టీమ్ ఆ చిత్ర యూనిట్‌తో టచ్‌లో ఉంది. సినిమా ప్రమోషన్స్‌కు రాకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పింది. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదు. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను.' అని ఆమె తెలిపింది. 'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
అక్కడ అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ అద్భుతమైన నటనతో పాటు థ్రిల్లింగ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులని గెలుచుకుంది. దీంతో ఈ సినిమాకు పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు. డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్లో చెప్పినట్లుగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులను 'మంగళవారం' సినిమా గెలుచుకుందని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలిపారు. తమ చిత్రానికి ఈ అవార్డ్స్ దక్కడం చాలా సంతోషం అని విన్నర్స్ పేర్లు వెల్లడించారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణంలోకి భాగమయ్యారు. ► ఉత్తమ నటి - పాయల్ రాజపుత్ ► ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్ ► ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్ -
Mangalavaaram: 'మంగళవారం' సినిమాలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఫొటోలు చూశారా..దివ్యా పిళ్లైకి క్రేజ్ మామూలుగా లేదుగా!
-
'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం
పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్‌కి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరూ అవాక్కయ్యేలా చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్గా 'మంగళవారం' సినిమాతో క్రేజీ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం పాయల్‌కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి టైంలో ఈ బ్యూటీ ఇంట్లో విషాదం నెలకొంది. (ఇదీ చదవండి: 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!) ఇయర్ ఎండింగ్లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్.. క్షమించు, నిన్ను బతికించుకోలేకపోయాను అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. పెట్ డాగ్‌తో ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుని పలు వీడియోల్ని షేర్ చేసింది. 'నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతా.. ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది.. నిన్ను ఎంతగానో ప్రేమించా.. ఇకపై నా జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా.. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని హీరోయిన్ పాయల్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఈమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు పలువురు స్పందిస్తున్నారు. పాయల్ కెరీర్ విషయానికొస్తే 'మంగళవారం' సినిమాతో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్‌పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్‌పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్‌లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్‌లైన్స్.. అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్‌లైన్ సిబ్బందిగా తన కెరీర్‌ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్‌లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే
సాధారణంగా కొత్త మూవీస్ ఏ శుక్రవారమో శనివారమో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు మాత్రం డిఫరెంట్‌గా వారం మధ్యలో విడుదల చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తెలుగు హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్- అజయ్ భూపతి కాంబో.. ఈ మూవీతో మరో క్రేజీ హిట్ అందుకున్నాడు. హిట్ సినిమా 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'మంగళవారం' మూవీ తీశారు. తనకు అచొచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్గా చేసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. (ఇదీ చదవండి: బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత) ఆ ఓటీటీలోనే అయితే థియేటర్లలో 'మంగళవారం' సినిమా.. నవంబరు 17న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ ఉండటంతో దీన్ని జనాలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. థియేటర్లలో ఈ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు గానీ ఓటీటీలో మాత్రం మంగళవారమే రిలీజ్ చేశారండోయ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి! కథేంటి? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి వీకెండ్‌తో 2023కి ఎండ్ కార్డ్ పడనుంది. గత శుక్రవారం థియేటర్లలోకి 'సలార్' వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ 'డెవిల్', సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న 'బబుల్గమ్' చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన మంగళవారం, 12th ఫెయిల్, నయనతార 'అన్నపూరణి'.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి కానీ అవి రిలీజైతే గానీ వాటి సంగతేంటనేది తెలీదు. మరి ఏ మూవీ ఏ ఓటీటీల్లో రిలీజ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే క్రేజీ మూవీస్ (డిసెంబరు 25 నుంచి 31 వరకు) నెట్‌ఫ్లిక్స్ రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) - డిసెంబరు 25 స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 25 కో గయే హమ్ కహా (హిందీ సినిమా) - డిసెంబరు 26 థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) - డిసెంబరు 26 ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) - డిసెంబరు 27 హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 27 లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 28 మిస్ శాంపో (మాండరిన్ సినిమా) - డిసెంబరు 28 పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 28 అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబరు 29 బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 29 శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) - డిసెంబరు 29 త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 31 ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) - డిసెంబరు 31 అమెజాన్ ప్రైమ్ కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 27 టైగర్ 3 (హిందీ చిత్రం) - డిసెంబరు 31 హాట్‌స్టార్ మంగళవారం (తెలుగు సినిమా) - డిసెంబరు 26 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 29 జీ5 దోనో (హిందీ మూవీ) - డిసెంబరు 29 వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబరు 29 సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబరు 29 జియో సినిమా ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 25 ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 30 లయన్స్ గేట్ ప్లే ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 29 బుక్ మై షో ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 29 (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
పాయల్ రాజపూత్ స్పెషల్ వీడియో
-
Payal Rajput: పాయల్‌కు కలిసొచ్చిన ‘మంగళవారం’
ఒక్క హిట్‌తో ఊహించని స్టార్‌డమ్‌ను సాధించింది నటి పాయల్ రాజ్‌పుత్. కానీ కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడిప్పుడే వరుస చాన్స్‌లతో మళ్లీ బిజీ అవుతోంది. ఆ విషయాలే క్లుప్తంగా.. ► పాయల్ స్వస్థలం ఢిల్లీ. తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్.. టీచర్. తల్లి నిర్మల్ రాజ్‌పుత్.. గృహిణి. ఢిల్లీలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్ స్కూల్లో చదివింది. యాక్టింగ్ కోర్స్‌లో డిప్లొమా పూర్తి చేసింది. ► ‘సప్నోం సే భరే నైనా’ అనే హిందీ సీరియల్‌తో మొదట బుల్లితెరకు, తర్వాత పంజాబీ సినిమా ‘ఛన్నా మేరేయా’తో సినీ ప్రేక్షకులకూ పరిచయం అయింది. 2018లో ‘ఆరెక్స్ 100’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి యూత్‌లో క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ► ఆ పాపులారిటీ ఆమెకు ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్ మార్ఖాన్’, ‘జిన్నా’ వంటి తెలుగు సినిమాలతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటనావకాశాలను తెచ్చిపెట్టింది. సక్సెస్ గ్రాఫే సస్టెయిన్ కాలేకపోయింది. ► సినీఫీల్డ్‌లో పాయల్ కాస్త స్లో అయిన సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆమెకు వెల్కమ్ చెప్పింది. ‘3 రోజెస్’, ‘అనుకోని అతిథి ’ వంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది. ఇటీవలే ‘మంగళవారం’ మూవీతో మళ్లీ హిట్ సాధించి.. డేట్స్ ఖాళీలేని అవకాశాలను అందుకుంటోంది. ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడ్డాను. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవే. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే నాకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి: పాయల్ రాజ్‌పుత్ -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ సినిమా.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' మూవీ సందడి కనిపిస్తోంది. మూవీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ అయ్యేలోపు ఎలా అయినాసరే ప్రభాస్ సినిమా చూసేయాలని తెగ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో అవకాశాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఓ తెలుగు హిట్ మూవీ రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే ఒకటి స్టార్స్ అయినా ఉండాలి లేదంటే కంటెంట్ అయినా డిఫరెంట్‌గా ఉండాలి. అలా నవంబరు ట17న పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ 'మంగళవారం'. కాకపోతే సరిగ్గా దీని రిలీజ్ టైంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగడం వల్ల ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ తేదీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా ప్రకటించింది. డిసెంబరు 26న అంటే మంగళవారం రోజునే 'మంగళవారం' మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. ఓవైపు 'సలార్' థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం కచ్చితంగా ప్లస్ అవుతుందని అనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్‌లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రవీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ మంగళవారం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్‌తో పూనకాలు వచ్చేస్తాయి. -
డైరెక్టర్ గురించి చెప్పాలంటే!
-
మాస్క్ తో చేసే సీన్స్ లో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే!
-
నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్‌కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్‌పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. -
ఈ సినిమాలో నన్ను ఎవరైనా చూస్తారా లేదా అని భయమేసింది
-
తరుణ్ భాస్కర్ తొడల పై మంగళవారం కామెంట్స్ చేసిన విశ్వక్..!
-
దర్శి గాడి సినిమానే కదా OTTలో చూద్దాంలే అనుకోవద్దు..!
-
పాయల్ Cute స్పీచ్ మంగళవారం సినిమా గురించి
-
నా జీవితాన్ని 'మంగళవారం' మార్చింది: ప్రియదర్శి
‘‘అజయ్ భూపతికథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. అయితే డేట్స్ కుదరక నేనా సినిమా చేయలేకపోయా. ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్‌తో ‘మంగళవారం’ని రెండున్నర గంటల సినిమాగా నిజాయతీగా చెపారు అజయ్ భూపతి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ–‘‘పాయల్ పాత్రని అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా అని కాస్త భయపడ్డా. అయితే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నా సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో... ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక 'మంగళవారం' మార్చింది. నా జీవితంలో గుర్తుపెట్టుకునే 'మంగళవారం' ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా’ అన్నారు. ‘మా సంస్థలో తీసిన తొలి సినిమా ‘మంగళవారం’ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు సురేష్ వర్మ. -
దెబ్బకొట్టిన ప్రపంచకప్ ఫైనల్.. తెలుగు హిట్ సినిమాకు ఆ రేంజ్ నష్టాలు!
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా మనోళ్లకు అదృష్టం కలిసిరాలేదని.. అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సరే దాని గురించి అలా వదిలేయండి. ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ వల్ల ఓ తెలుగు హిట్ సినిమాపై దారుణమైన దెబ్బ పడింది. అలాంటి ఇలాంటి దెబ్బ కాదని చెప్పొచ్చు. దీంతో లాభాలు రావాల్సింది నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటి? దురదృష్టం.. ఎప్పుడు, ఎలా వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. 'మంగళవారం' చిత్రానికి మాత్రం ప్రపంచకప్ ఫైనల్ రూపంలో వచ్చింది. సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది. కానీ ఏం లాభం. టీమిండియా.. ఈ వరల్డ్‌కప్‌లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్‌కి చేరడం.. 'మంగళవారం' మూవీకి శాపమైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్లో మాత్రం వరల్డ్‌కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు. మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే సందేహమే!? అలానే వరల్డ్‌కప్ లేకపోయింటే.. 'మంగళవారం' సినిమాకు తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండేవని, ఈ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. ఇప్పుడు వీక్ డేస్‌లో జనాలు ఈ సినిమాని ఆదరిస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే హిట్ కొట్టిన నష్టాలు మాత్రం తప్పవు! (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
మంగళవారం మూవీ సక్సెస్ మీట్.. పాయల్ రాజ్‌పుత్ సందడి (ఫోటోలు)
-
మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్ హీరోను దించేశారుగా!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్100 మూవీతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత అజయ్ మహాసముద్రం మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్‌తో కలిసి ‘మంగళవారంతో దూసుకొచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్‌పుత్. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. (ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ) #Mangalavaram in Theatres now 💥💐💥💐 pic.twitter.com/8pOArYDuPZ — Moviezupp Entertainment (@moviezupp) November 17, 2023 -
Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ
టైటిల్: మంగళవారం నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి దర్శకత్వం:అజయ్ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి విడుదల తేది: నవంబర్ 17, 2023 ‘మంగళవారం’కథేంటంటే.. ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు. మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ టచ్‌తో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దాంతో పాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. అలా అని ఇది మెసేజ్ ఓరియెంటెంట్ ఫిల్మ్‌గా సాగదు. కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు.. అసలు కథ ప్రారంభం కాదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి. శైలు చిన్ననాటి ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం..తండ్రి మరోపెళ్లి చేసుకోవడం..అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్‌పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. శైలు, రవిల చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి..ఆ తర్వాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే 1996కు తీసుకెళ్లాడు. అక్కడ వరుస మరణాలు.. గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం.. మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం.. ఇలా ప్రతి మంగళవారం జరగడం.. దాని వెనుక ఉన్నదెవరని ఎస్సై మాయ చేపట్టే విచారణ.. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం.. ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్టాఫ్‌ను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శైలు లవ్‌స్టోరీ ఎపిసోడ్‌తో చాలా ఎమోషనల్‌గా ద్వితియార్థం ప్రారంభం అవుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్‌గా చూపిస్తూనే. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అలా చేయడం చాలా కష్టమైన పని.. కొంచెం తేడా కొట్టినా.. ఫలితమే మారిపోతుంది. కానీ అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్‌తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం.. బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ చాలా సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గాళ్‌గానే చూపించారు. కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్‌ని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. శైలు పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇక ఎస్సై మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది. అయితే నటనకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఆమెది. అజయ్ ఘోష్, లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వారిద్ధరి మధ్య సంబాషణలు నవ్వులు పూయిస్తాయి. శైలు చిన్ననాటి ప్రియుడు, మాస్క్ ధరించిన వ్యక్తి( ఈ నటుడి ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిలింగ్‌గా ఉంటుంది) కూడా అద్భుతంగా నటించాడు. ఆర్ఎంపీ డాక్టర్‌గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్‌ని అదించింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మంగళవరం మేకింగ్ మూవీ
-
'మంగళవారం' ఛాన్స్ కోసం డైరెక్టర్ వెంటపడ్డా: పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే 'మంగళవారం' చేసింది. ఈ శుక్రవారం (నవంబరు 17)న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు) 'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డా. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. అలానే కొన్నాళ్లకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. నాకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం. శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేకపోయాను. నా చేతిపై గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు నటించిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జు చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) -
స్నేహానికి వ్యాపారాన్ని ముడిపెట్టలేను
పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమర్ ప్రధాన పాత్రధారులుగా, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతీరెడ్డి గునుపాటి (వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె), ఎం. సురేష్ వర్మ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రనిర్మాతలు మాట్లాడారు. స్వాతీరెడ్డి గునుపాటి మాట్లాడుతూ – ‘‘అజయ్ భూపతిగారు చెప్పిన ‘మంగళవారం’ కథ విని, ఈ సినిమా చేస్తే బాగుంటుందనిపించి చేశాను. ఓ సెన్సిటివ్ ఇష్యూని ఆయన సందేశాత్మకంగా చెప్పిన విధానం నాకు నచ్చింది. పాయల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడింది. అజనీష్ మ్యూజిక్ బాగుంటుంది. ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా అగ్రతారలతో పరిచయం ఉంది. నేను అడిగితే వారు నాతో సినిమాలు చేస్తారు. కానీ నిర్మాతగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. వాళ్ల స్థాయికి తగ్గ సినిమాలను నిర్మించే అవకాశం ఉన్నప్పుడు వారితో నేను సినిమాలు చేస్తాను. ఎందుకంటే స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం ఇష్టం లేదు’’ అన్నారు. మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజు నుంచే అల్లు అర్జున్‌గారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక చిన్నతనం నుంచి చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన మా ట్రైలర్‌ను విడుదల చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. -
'మంగళవారం'లో జీరో ఎక్స్పోజింగ్... చివరి 45 నిమిషాలు మాత్రం!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తీసిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది. నవంబర్ 17న తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ భూపతి.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) 'మంగళవారం' ఐడియా అలా! 'మహాసముద్రం' తీస్తున్నప్పుడు 'మంగళవారం' ఐడియా వచ్చింది. చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. ఇలాంటి సినిమాకు దర్శకత్వం అంత సులభం కాదు. పాయల్ క్యారెక్టర్ అలా పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. తనకు నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) 'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు. మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ''మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు'' అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా బన్నీ (ఫొటోలు)
-
అతను నా ప్రేమను రిజెక్ట్ చేశాడు.. నెలల తరబడి ఏడ్చాను: పాయల్ రాజ్‌పుత్
‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్‌కి పరిచమైంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ ఖాతాలో మాత్రం సరైన హిట్ పడలేదు. దీంతో కొంతకాలం తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ‘మంగళవారం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన కెరీర్లో భారీ హిట్ అందించిన ‘ఆర్ఎక్స్ 100’ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయల్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: హీరో విజయ్ విడాకుల రూమర్స్.. లియో నటి ఏమందంటే?) వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి లవ్‌స్టోరీని వెల్లడించింది పాయల్. మీ క్రష్ ఎవరనే ప్రశ్నకు పాయల్ సమాధానం ఇస్తూ.. ‘స్కూల్ డేస్‌లో ఓ అబ్బాయిని పిచ్చిగా ప్రేమించాను. అతన్ని చూడగానే నాలో ఏదో తెలియని ఆనందం కలిగేది. దాన్నే నేను ప్రేమగా భావించాను. టెన్త్ క్లాస్ ఎండింగ్లో నా ప్రేమ విషయాన్ని అతనికి చెప్పాను. (చదవండి: నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!) కానీ అతను నా లవ్ ప్రపోజ్‌ని రిజెక్ట్ చేశాడు. తనకు ప్రేమపై ఆసక్తి లేదని చెప్పాడు. దీంతో నేను నెలల తరబడి ఏడ్చాను. చదువుపై శ్రద్ద పెట్టలేక పోవడంతో ఆ ఏడాది పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. ఆ విషయాన్ని అమ్మకి చెప్పి ఏడ్చాను. ఆమె నాకు మద్దతుగా నిలిచి.. నేను మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా సహాయపడింది’అని నాటి సంగతులను గుర్తు చేసుకుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ. ‘మంగళవారం’ షూటింగ్ సమయంలో తాను కిడ్నీ సమస్యతో బాధపడ్డానని, జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ ఎమోషనల్ అయింది. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే తనకు కిడ్నీ సమస్యల ఏర్పడిందన్నారు. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి అని పాయల్ విజ్ఞప్తి చేశారు. -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
వారాలను వాడేస్తున్న డైరెక్టర్స్.. టాలీవుడ్లో ఈ టైటిలే ట్రెండింగ్!
ఒకప్పుడు సినిమా టైటిల్ చూడగానే దాని కథ ఏంటి? ఏ జానర్ ఫిల్మ్? అనేది ఈజీగా తెలిసిపోయేది. కానీ ఇప్పటి సినిమాలకు మాత్రం విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. కొన్ని టైటిల్స్‌కి కథతో సంబంధం ఉంటే.. మరికొన్నింటికి మాత్రం మీనింగే ఉండడం లేదు. కొత్తగా, ట్రెడింగ్లో ఉన్న పదం కనిపిస్తే చాలు అదే సినిమా టైటిల్ అవుతుంది. ఇక టాలీవుడ్లో అయితే ఇటీవల వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా వాడేస్తున్నారు దర్శకులు. ఆదివారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. ‘శనివారం’వాడేసిన నాని ‘అంటే సుందరానికీ.. ’తర్వాత నాని, వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా సోమవారం టైటిల్‌ని ప్రకటిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ‘యాక్షన్ మాస్ ఎంటర్టైనర్’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మంగళవారం’కోసం పాయల్ ఎదురుచూపులు ‘మంగళవారం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక ఊర్లో ప్రతి మంగళవారం జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రెండేళ్ల క్రితమే ‘గురువారం’ వాడేసిన శ్రీసింహా రెండేళ్ల క్రితమే గురువారాన్ని తన టైటిల్‌గా వాడేశాడు కీరవాణి కొడుకు శ్రీసింహా. ఆయన హీరోగా మణికాంత్ గెల్ల దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. కానీ ఆ కామెడినీ ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఆడవాళ్ల కోసం ఆదివారం ఇక ఆదివారాన్ని సైతం తమ సినిమా టైటిల్‌గా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకుడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’అనే చిత్రం 2007లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇవే కాదు.. సోమ, బుధ, శుక్రవారం పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి. ఏ వెన్నెస్ డే(బుధవారం) పేరుతో నసీరుద్దీన్ షా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఈనాడు’తో కమల్ సినిమా వచ్చింది. శుక్రవారం, సోమవారం పేరుతో కూడా గతంలోనే సినిమాలు వచ్చాయి. మొత్తానికి మన దర్శక నిర్మాతలు అన్ని వారాలను వాడేశారు...ఇక మిగిలింది నెలల పేర్లే.. రానున్న రోజుల్లో జనవరి.. ఫిబ్రవరి.. అంటూ నెలల పేర్లు కూడా టైటిల్స్‌గా వస్తాయేమో చూడాలి. -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్‌గారు’’ అన్నారు పాయల్. -
ఈ కారణంతో సర్జరీ కూడా చేపించుకోలేదు: పాయల్ రాజ్‌పుత్
ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి మహాసముద్రంతో ఫ్లాప్ ఇచ్చాడు. చాలారోజుల గ్యాప్ తర్వాత పక్కా ప్లాన్‌తో ఈసారి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. 1980లో ఒక గ్రామంలో వరుస హత్యల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్) ఈ కథపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఒక విషయాన్ని ఇలా షేర్ చేసింది. 'అజయ్ నన్ను అప్రోచ్ అయ్యే టైమ్‌కు నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. సర్జరీకి వెళ్లాల్సిందే అని వైద్యులు సూచించారు. అయితే అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను.' అని అప్పుడే చెప్పాను. ఇదొక అద్భుతమైన కథతో రూపొందిన సినిమా అని. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అలాగే తనకు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నట్లు పాయల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి ఎందుకు లాంచ్ చేశారంటే ‘మంగళవారం’ సినిమా నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి తన కుమార్తె శ్రీజకి మంచి స్నేహితురాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. స్వాతిరెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి అని.. అలాంటి అమ్మాయి నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయడమే కాకుండా తనే దగ్గరుండి ఒక సినిమాను నిర్మిస్తే కచ్చితంగా ప్రోత్సహించాలని మెగాస్టార్ చెప్పారు. ‘మంగళవారం’ ట్రైలర్‌ను ఎక్స్ ద్వారా విడుదల చేసిన చిరంజీవి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) -
ఆ ఊర్లోని చావులకు కారణం ఎవరు?.. ఆసక్తికరంగా ‘మంగళవారం’ ట్రైలర్
‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మంగళవారం’. . పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఒక ఊర్లో జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లను ఓ అజ్ఞాతవాసి గోడపై రాస్తుంటాడు. ఆ గోడమీద రాస్తున్నదెవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి మంగళవారం ఊర్లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ‘ట్రైలర్’ సాగుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
శుక్రవారం రిలీజ్ కానున్న మంగళవారం!
ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తోన్న మంగళవారం. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో పోషిస్తుండగా.. శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంగళవారం' నవంబర్ 17న విడుదల కానుంది. (ఇది చదవండి: కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!) గ్రామీణ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. కాగా.. ఈ సినిమాలో చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కన్నడ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మంగళవారం' చిత్రాన్ని డిఫరెంచ్గా తెరకెక్కిస్తున్నట్లు అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నామని.. ఇందులో మొత్తం 30 పాత్రలున్నాయని తెలిపారు. ఆర్ఎక్స్ 100 తరహాలోనే అజయ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Excited to show y'all a story that'll twist your heart like never before🦋#Mangalavaaram #Mangalavaar #Chevvaikizhamai #Chovvazhcha Releasing Worldwide in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada on November 17th 🔥 An @AJANEESHB Musical 🥁@starlingpayal @Nanditasweta… pic.twitter.com/1G9OjAAn0w — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023 -
పాయల్ రాజ్‌పుత్ 'మంగళవారం' నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్
‘అమ్మా డంగురు డంగురు డంగురుమా... అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా... హారతందుకో... మమ్ము ఆదుకో..’ అంటూ మొదలవు తుంది ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియో. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ చిత్రంలోనిదీ పాట. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి నిర్మాణ భాగస్వామిగా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా వీఎం మహాలింగం పాడారు. ‘‘కొన్నేళ్లపాటు జాతరలలో ఈ పాట వినిపిస్తుంది’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఓ కీలక సందర్భంలో ఈ పాట వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు
సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్ సినిమా తీసేందకు ప్లాన్ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్ కొట్టేందుకు స్కెచ్ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్-100'తో దర్శకుడు అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాంతో తాజాగా తన సత్తా చాటేందకు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా మంగళవారం అనే పాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్. ఇప్పటికే ఆయన టీజర్ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్ జగదీష్' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్ కొడతారేమో. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?) -
పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!
'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా 'మంగళవారం'. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకటిరెండు డైలాగ్స్ మాత్రమే ఉన్నప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ టీజర్ లో చాలా క్యారెక్టర్స్ ని చూపించారు. వాళ్లందరూ ఆకాశంలో ఏదో వింతను చూస్తున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. చివర్లో పాయల్ అరుస్తున్న సన్నివేశం, నగ్నంగా ఉన్న సీన్స్ అయితే 'మంగళవారం'పై ఆసక్తిని పెంచుతున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మేజర్ హైలెట్ గా నిలిచింది. విడుదల తేదీ ప్రకటించలేదు గానీ ఇదేదో బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ షూటింగ్ పూర్తి
‘ఆర్ఎక్స్ 100’ వంటి హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉండగా, ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది’’ అన్నారు. స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు రానటువంటి కొత్త జానర్ కథతో ‘మంగళవారం’ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 99 రోజులు చేస్తే.. అందులో 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ ఫస్ట్ లుక్
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. 'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాయల్ లుక్ నెట్టింట్ వైలర్ అవుతోంది. (చదవండి: రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?) ఈ సినిమా గురించి అజయ్ మాట్లాడుతూ.. 'గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది' అని అన్నారు. ‘ 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది’ అన్నారు నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. Shailuu... will stay in your hearts for a long while 🔥 Presenting @starlingpayal in a never-seen-before role from our new-genre film #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋@DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/IYJmL7eHd1 — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 25, 2023