ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. ఈసారి కూడా మనోళ్లకు అదృష్టం కలిసిరాలేదని.. అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. సరే దాని గురించి అలా వదిలేయండి. ఇదే వరల్డ్‌కప్ ఫైనల్ వల్ల ఓ తెలుగు హిట్ సినిమాపై దారుణమైన దెబ్బ పడింది. అలాంటి ఇలాంటి దెబ్బ కాదని చెప్పొచ్చు. దీంతో లాభాలు రావాల్సింది నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంతకీ ప్రపంచకప్- ఆ తెలుగు చిత్రానికి సంబంధమేంటి?
దురదృష్టం.. ఎప్పుడు, ఎలా వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. 'మంగళవారం' చిత్రానికి మాత్రం ప్రపంచకప్ ఫైనల్ రూపంలో వచ్చింది. సినిమాపై మంచి బజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానికి తోడు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన టాక్ సంపాదించింది. కానీ ఏం లాభం. టీమిండియా.. ఈ వరల్డ్‌కప్‌లో అత్యద్భుతమైన ఫామ్ తో ఫైనల్‌కి చేరడం.. 'మంగళవారం' మూవీకి శాపమైంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)
ఆదివారం ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ శనివారం నుంచి దేశమంతా ఆ వైబ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీని పూర్తిగా మరిచిపోయారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్‌లో ఘోరమైన డ్రాప్ కనిపించింది. తొలిరోజు బాగానే వచ్చాయి కానీ కీలకమైన వీకెండ్‌లో మాత్రం వరల్డ్‌కప్ వల్ల జనాలు థియేటర్ల ముఖమే చూడలేదు. మనోళ్లు కప్ కొట్టకపోయేసరికి అభిమానులు ఇంకా బాధలోకి వెళ్లిపోయారు. దాన్నుంచి బయటకొచ్చి సినిమా చూస్తారా? అంటే సందేహమే!?
అలానే వరల్డ్‌కప్ లేకపోయింటే.. 'మంగళవారం' సినిమాకు తక్కువలో తక్కువ రూ.3 కోట్లు గ్రాస్ వసూళ్లు అయినా వచ్చి ఉండేవని, ఈ ఫైనల్ దెబ్బకు రూ.1 కోటి కంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు టాక్. ఇప్పుడు వీక్ డేస్‌లో జనాలు ఈ సినిమాని ఆదరిస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే హిట్ కొట్టిన నష్టాలు మాత్రం తప్పవు!
(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment