
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' మూవీ సందడి కనిపిస్తోంది. మూవీ లవర్స్ అందరూ ఈ వీకెండ్ అయ్యేలోపు ఎలా అయినాసరే ప్రభాస్ సినిమా చూసేయాలని తెగ ట్రై చేస్తున్నారు. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం కనిపించట్లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో అవకాశాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఓ తెలుగు హిట్ మూవీ రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది.
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
ఇప్పుడు సినిమా హిట్ కావాలంటే ఒకటి స్టార్స్ అయినా ఉండాలి లేదంటే కంటెంట్ అయినా డిఫరెంట్‌గా ఉండాలి. అలా నవంబరు ట17న పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీ 'మంగళవారం'. కాకపోతే సరిగ్గా దీని రిలీజ్ టైంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగడం వల్ల ప్రేక్షకులకు సరిగా రీచ్ కాలేకపోయింది.
ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ తేదీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా ప్రకటించింది. డిసెంబరు 26న అంటే మంగళవారం రోజునే 'మంగళవారం' మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. ఓవైపు 'సలార్' థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. మరోవైపు ఓటీటీలోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా రావడం కచ్చితంగా ప్లస్ అవుతుందని అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి)
Comments
Please login to add a commentAdd a comment