
‘ఆర్‌ఎక్స్ 100’ వంటి హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉండగా, ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది’’ అన్నారు.
స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు రానటువంటి కొత్త జానర్ కథతో ‘మంగళవారం’ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 99 రోజులు చేస్తే.. అందులో 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment