'మంగళవారం' ఛాన్స్ కోసం డైరెక్టర్ వెంటపడ్డా: పాయల్ | Actress Payal Rajput Special Interview About Mangalavaram Movie - Sakshi
Sakshi News home page

Mangalavaaram Movie: ఇప్పటివరకు ఎవరూ చూడనిది 'మంగళవారం' సినిమాలో!

Published Wed, Nov 15 2023 7:01 PM | Last Updated on Wed, Nov 15 2023 7:26 PM

Payal Rajput Interview About Mangalavaram Movie Latest - Sakshi

'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే 'మంగళవారం' చేసింది. ఈ శుక్రవారం (నవంబరు 17)న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. 

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)

'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డా. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. అలానే కొన్నాళ్లకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. నాకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం.  

   

శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేకపోయాను. నా చేతిపై గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 

'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు నటించిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జు చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement