'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తీసిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది. నవంబర్ 17న తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ భూపతి.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!)
'మంగళవారం' ఐడియా అలా!
'మహాసముద్రం' తీస్తున్నప్పుడు 'మంగళవారం' ఐడియా వచ్చింది. చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. ఇలాంటి సినిమాకు దర్శకత్వం అంత సులభం కాదు.
పాయల్ క్యారెక్టర్ అలా
పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. తనకు నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)
'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు.
మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ''మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు'' అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment