టాలీవుడ్ డైరెక్టర్‌ అరుదైన ఘనత..! | Mangalavaaram Movie Director Ajay Bhupathi Receives Award | Sakshi
Sakshi News home page

Ajay Bhupathi: మంగళవారం డైరెక్టర్‌కు క్రేజీ అవార్డ్!

Published Tue, Apr 16 2024 9:40 PM | Last Updated on Wed, Apr 17 2024 9:27 AM

Mangalavaaram Movie Director Ajay Bhupathi - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్‌ హిట్‌ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. 

తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది.  ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘

కాగా.. అజయ్ భూపతి ఆర్‌ఎక్స్‌ 100తో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్‌ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ  చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై  కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement