
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్‌ఎక్స్100 పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.
(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)
అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్‌కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్‌పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment