
మలయాళ టాప్ హీరో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) మార్చి 27న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆయన ఒక కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా రెమ్యునరేషన్ వివరాల గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు.
'లూసిఫర్2' కోసం మోహన్‌లాల్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్లే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ పెరగడంతో సినిమా చిత్రీకరణ విషయంలో కాస్త జాప్యం ఏర్పడిందని పృథ్వీరాజ్ తెలిపారు. ‘‘ఎల్ 2 ఎంపురాన్’లో స్టీఫెన్ గట్టుపల్లి (ఖురేషి అబ్రమ్)గా మోహన్‌లాల్, ఆయనకు రైట్ హ్యాండ్‌లా జయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
మోహన్‌లాల్ రెమ్యునరేషన్ గురించి గతంలో కూడా పలు వార్తలు వచ్చాయి. లూసిఫర్ భారీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తీయాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్ ముందుకు రావడంతో సినిమా మొదలైంది. అయితే, బడ్జెట్ పెరిగిపోవడంతో ఆ ఇబ్బందులు గ్రహించిన మోహన్‌లాల్ తనకు రెమ్యునరేషన్ వద్దని చెప్పారట. అదే విషయాన్ని ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అయితే, ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సుకుమారన్ తీసుకున్నారు. అందుకు గాను ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కానీ, సినిమా నుంచి లాభాలు ఏమైనా వస్తే అందులో షేర్ తీసుకునే ఛాన్స్ ఉంది.

కన్నప్పకు కూడా అండగా నిలిచిన మోహన్‌లాల్
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న కన్నప్పలో మోహన్‌లాల్ కూడా కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించాలని మోహన్‌లాల్‌ను కోరిన వెంటనే ఆయన ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ గురించి విష్ణు తెలిపారు. 'అంకుల్.. రెమ్యునరేషన్ గురించి మీ మేనేజర్‌తో ఏమైనా మాట్లాడమంటారా అని అడిగాను. అప్పుడు ఆయన నవ్వుతూనే.. ‘నువ్వు అంత పెద్ద వాడివయ్యావా..?’ అని అన్నారు. ఈ మూవీ కోసం ప్రభాస్ కూడా ఎలాంటి రెమ్యునరేషన తీసుకోలేదని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment