![Payal Rajput Birthday Post To Her Boyfriend In Social Media](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/rajput.jpg.webp?itok=BYvWp2c-)
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరినీ తన గ్లామర్‌తో అలరించిన ఈ బ్యూటీ.. 'మంగళవారం' సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమాతో విభిన్నమైన పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా విషెస్ చేసింది. అతనితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది మంగళవారం భామ.
పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నన్ను అర్థం చేసుకునే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దయ, మద్దతు నా జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు. అన్ని వేళల్లో మీ మార్గదర్శకత్వం, ప్రేమను అందిస్తూ మీరు నా కోసం ఉన్నందుకు చాలా కృతజ్ఞతతో ఉన్నా. ఈ ప్రత్యేకమైన రోజున ఎల్లప్పుడు ఆనందం, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేసింది.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వెంకటలచ్చిమి అనే పాన్ ఇండియా మూవీలో కనిపించనుంది. ఈ చిత్రానికిముని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభమైంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయమని డైరెక్టర్ ముని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment