మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా! | Mangalavaram Movie Trailer Launch by Karthikeya | Sakshi
Sakshi News home page

మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!

Published Sun, Oct 22 2023 6:35 AM | Last Updated on Sun, Oct 22 2023 6:35 AM

Mangalavaram Movie Trailer Launch by Karthikeya - Sakshi

నందిత, స్వాతి, అజయ్‌ భూపతి, కార్తికేయ, పాయల్, అజ్మల్, సురేష్‌ వర్మ

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నేను, అజయ్‌ భూపతి లేదా నేను, పాయల్‌ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్‌లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్‌ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు.

100 పర్సెంట్‌ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్‌ రాజ్‌పుత్, అజ్మల్‌ ఆమిర్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్‌ థ్రిల్లర్‌. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్‌ని టచ్‌ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్‌), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్‌ వర్మ. ‘‘నా కెరీర్‌ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్‌ ఇచ్చారు అజయ్‌గారు’’ అన్నారు పాయల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement