హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
తాజాగా జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‍పుత్‍తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కించుకుంది.
‘మంగళవారం’కథేంటంటే..
ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.
మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్‌ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment