Payal Rajput: పాయల్‌కు కలిసొచ్చిన ‘మంగళవారం’ | Here Are Some Interesting And Lesser Known Facts About Payal Rajput In Telugu, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Payal Rajput Interesting Facts: పాయల్‌కు కలిసొచ్చిన ‘మంగళవారం’

Published Sun, Dec 24 2023 9:03 AM | Last Updated on Sun, Dec 24 2023 11:44 AM

Interesting Facts About Payal Rajput - Sakshi

ఒక్క హిట్‌తో ఊహించని స్టార్డమ్‌ను సాధించింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. కానీ కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడిప్పుడే వరుస చాన్స్‌లతో మళ్లీ బిజీ అవుతోంది. ఆ విషయాలే క్లుప్తంగా..

పాయల్‌ స్వస్థలం ఢిల్లీ. తండ్రి విమల్‌ కుమార్‌ రాజ్‌పుత్‌.. టీచర్‌. తల్లి నిర్మల్‌ రాజ్‌పుత్‌.. గృహిణి. ఢిల్లీలోని డీఏవీ సెంటినరీ పబ్లిక్‌ స్కూల్లో చదివింది. యాక్టింగ్‌ కోర్స్‌లో డిప్లొమా పూర్తి చేసింది.

► ‘సప్నోం సే భరే నైనా’ అనే హిందీ సీరియల్‌తో మొదట బుల్లితెరకు, తర్వాత పంజాబీ సినిమా ‘ఛన్నా మేరేయా’తో సినీ ప్రేక్షకులకూ పరిచయం అయింది. 2018లో ‘ఆరెక్స్‌ 100’తో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి యూత్‌లో క్రేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. 

► ఆ పాపులారిటీ ఆమెకు ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్‌ మార్‌ఖాన్‌’, ‘జిన్నా’ వంటి తెలుగు సినిమాలతోపాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటనావకాశాలను తెచ్చిపెట్టింది. సక్సెస్‌ గ్రాఫే సస్టెయిన్‌ కాలేకపోయింది. 

► సినీఫీల్డ్‌లో పాయల్‌ కాస్త స్లో అయిన సమయంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఆమెకు వెల్‌కమ్‌ చెప్పింది.  ‘3 రోజెస్‌’, ‘అనుకోని అతిథి ’ వంటి వెబ్‌ సిరీస్‌లతో ఆకట్టుకుంది. ఇటీవలే ‘మంగళవారం’ మూవీతో మళ్లీ హిట్‌ సాధించి.. డేట్స్‌ ఖాళీలేని అవకాశాలను అందుకుంటోంది. 

ఈ  మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్‌తో బాధపడ్డాను. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవే. నీళ్లు తక్కువగా తాగడం కారణంగానే నాకు ఆ ప్రాబ్లమ్‌ వచ్చింది. దయచేసి అందరూ నీళ్లు ఎక్కువగా తాగండి: పాయల్‌ రాజ్‌పుత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement