'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. 'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు.
ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాయల్ లుక్ నెట్టింట్ వైలర్ అవుతోంది.
(చదవండి: రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?)
ఈ సినిమా గురించి అజయ్ మాట్లాడుతూ.. 'గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది' అని అన్నారు. ‘ 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది’ అన్నారు నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Shailuu... will stay in your hearts for a long while 🔥
— Ajay Bhupathi (@DirAjayBhupathi) April 25, 2023
Presenting @starlingpayal in a never-seen-before role from our new-genre film #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋@DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/IYJmL7eHd1
Comments
Please login to add a commentAdd a comment