
‘అమ్మా డంగురు డంగురు డంగురుమా... అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా... హారతందుకో... మమ్ము ఆదుకో..’ అంటూ మొదలవు తుంది ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియో. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మంగళవారం’ చిత్రంలోనిదీ పాట. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించారు.
అజయ్ భూపతి నిర్మాణ భాగస్వామిగా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా వీఎం మహాలింగం పాడారు. ‘‘కొన్నేళ్లపాటు జాతరలలో ఈ పాట వినిపిస్తుంది’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఓ కీలక సందర్భంలో ఈ పాట వస్తుంది’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment