
డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin), ప్రియాంక దత్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు వారు పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి వెళ్తుండగా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' పార్ట్-2 అప్‌డేట్ గురించి అడిగారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు.

చాలారోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని నాగ్ అశ్విన్ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ అంతా అంతా బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కల్కి2 సినిమా గురించి మాట్లాడుతూ.. అందుకు ఇంకా చాలా టైమ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. పూర్తయిన దాని బట్టి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు.
‘కల్కి’ పార్ట్2 గురించి కొద్దిరోజుల క్రితమే మీడియా సమావేశంలో నాగ్ అశ్విన్ మాట్లాడారు. మహాభారతం నేపథ్యం నుంచి సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేశామన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్), స్పిరిట్, సలార్2, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అందుకే కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.