
ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ సినిమా వారం పూర్తి అయింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. తొలిరోజే రూ.191.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన 'కల్కి' తాజాగా రూ. రూ.800కోట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే రూ. 1000 కోట్ల మార్క్‌ను మరో కొద్దిరోజుల్లో చేరుకోవడం పెద్ద కష్టం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కల్కి సినిమాలోని ఫైట్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి యాక్షన్ సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సాలమన్ డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్స్ వెనుకున్న కష్టాన్ని ఆయన ఒక వీడియో ద్వారా పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment