Director Ameer
-
కథానాయకుడిగా ఆ దర్శకుడి మరో ప్రయత్నం..
చైన్నై సినిమా: దర్శకుడు అమీర్ చాలా గ్యాప్ తర్వాత మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం అమీర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేశారు. తన అమీర్ ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థ, జేఎస్ఎమ్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తనతో పాటు నటుడు ఆర్య సోదరుడు సత్య మరో కథానాయకుడిగా నటించనున్నట్లు చెప్పారు. నటి సంచితా శెట్టి హీరోయిన్గా కాగా విన్సెంట్ అశోక్, దినా, చరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తారని తెలిపారు. రాంజీ ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారని పేర్కొన్నారు. 'అధర్మం, పగైవన్' చిత్రాల ఫేమ్ రమేష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తారన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. -
దమ్ముంటే.. నీ పారితోషికం బయటపెట్టు!
‘కబాలి’ వసూళ్లలో బ్లాక్ ఎంత, వైట్ ఎంత? రజనీకాంత్‌పై విరుచుకుపడిన డైరెక్టర్ దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని రజనీకాంత్ సమర్థించిన విషయం తెలిసిందే. ‘హాట్సాప్ నరేంద్రమోదీజీ. ఇది నవ భారత జననం. జైహింద్’ అంటూ రజనీ ట్వీట్ చేశారు. అయితే రజనీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ అమీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా గతంలో ఏనాడూ స్పందించని రజనీ ఇప్పుడు ప్రధాని మోదీని ప్రశంసించడం ఏమిటని తప్పుబట్టారు. ‘దేశంలో గతంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. కానీ ఏనాడు రజనీ మాట్లాడలేదు. ఇప్పుడు పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీని ఆయన ప్రశంసించారు. ఎందుకంటే మోదీ ఆయనకు స్నేహితుడు. నవభారతం జన్మించిందని రజనీ అంటున్నారు. పాత భారతంలోనే మీ కబాలి సినిమా విడుదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు ఎంతో ప్రభుత్వానికి మీరు సమర్పిస్తారా? మీకు పారితోషికం బ్లాక్‌లో ఎంతముట్టిందో వైట్‌లో ఎంత ముట్టిందో చెప్పే దమ్ముందా? ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కన్నా అధికధరకు కబాలి సినిమా టికెట్లు అమ్ముకున్న విషయం ప్రజలందరికీ తెలుసు’ అని అమీర్ విమర్శించారు. పవన్, రజనీ మద్దతు వల్లే నరేంద్రమోదీ ప్రధాని కాగాలిగారని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నదని ఆయన చెప్పుకొచ్చారు.