సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. పవన్ రాకతో తోపులాట సందర్భంగా ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలోని గొడవర్రులో పర్యటించారు. ఈ సందర్బంగా గొడవర్రులో రోడ్డు నిర్మాణ పనులను పవన్ పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. తోపులాట కారణంగా అక్కడికి వచ్చిన ఓ బాలిక సొమ్మసిల్లి కింద పడిపోయింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment