krishna distict
-
నేరాలను నియంత్రించేందుకు సమాచార వ్యవస్థను మరింత..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు సమాచార వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సీసీఎస్ సిబ్బందికి ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం సమావేశపు హాలులో జిల్లాలోని సీసీఎస్ సిబ్బందితో ఎస్పీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, ప్రాపర్టీ రికవరీ, నేరస్తులకు శిక్ష పడేలా చేసిన కృషి తదితర విషయాల గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.బాధితులకు న్యాయం చేసి, జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. మంచి చేస్తే ప్రశంసిస్తానని, చెడు ప్రవర్తన కలిగిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచార వ్యవస్థను క్షేత్రస్థాయిలో పటిష్టపరిచి దోపిడీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచా లని, పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి వారిని కట్టడి చేయాలని ఆదేశించారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారు మళ్లీ నేరాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలి. నగర శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలన్నారు.నేరస్తులను గుర్తించడంలో, నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైందని పేర్కొన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి విక్రేతల కదలికలు గమనిస్తూ, వారి ఆటలు కట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ ఎ.సుభాష్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, రమణమ్మ, మోజెస్, డీసీఆర్బీ సీఐ సూర్యనారాయణ, పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ జె.వి.రమణ, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో మంగళవారం పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల, శనగపాడు, కొళ్లికూళ్ల గ్రామాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆనంగి శ్రీనివారావు యాదవ్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన తిరిగి ఉదయభాను సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. – సాక్షి నెట్వర్క్ ► విజయవాడ 11వ డివిజన్‌కు చెందిన టీడీపీ, జనసేన కార్యకర్తలు 100మందికి పైగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ► పల్నాడు జిల్లా వినుకొండలో కొప్పుకొండ గ్రామ పంచాయతీ బ్రహ్మయ్య పాకాలు గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. జనసేనకు చెందిన వీరందరికీ అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ► పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం నార్త్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో మెట్రేవు ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు బర్రి రమేష్ తన అనుచరులు సుమారు 25 మందితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో అత్తిలికి చెందిన తూర్పు కాపు సంఘ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో తూర్పు కాపు సంఘ నాయకులు, అత్తిలి రెండో వార్డు మాజీ సభ్యుడు ముల్లు సత్యనారాయణ, కిలాడి అప్పన్న, రెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్, మండలంలోని గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ► ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన 40 కుటుంబాలవారు టీడీపీ, జనసేన పారీ్టలను వీడి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. -
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
పేకాట ఆడుతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
కృష్ణాజిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవర్ యాక్షన్
-
వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..
కృష్ణా: అనాది కాలం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతం వజ్రాల వేటకు పెట్టింది పేరు. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణా తీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణ రకం మొదలుకొని లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందనే కథనం కూడా ప్రచారంలో ఉండటం గమనార్హం. ఒకప్పుడు చందర్లపాడు మండలంలో ఏకంగా వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే.. ఈ ప్రాంతంలో వజ్రాల వేట ఏ స్థాయిలో జరిగేదో.. ఎంతలా వజ్రాలు దొరికేవో అర్థం చేసుకోవచ్చు. నాటి నుంచి నేటి వరకు.. గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట ఈనాటిది కాదు.. దశాబ్దాల కాలంగా జరుగుతున్నదే.. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే.. ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్లు ఇదే పనిలో ఉంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకొని రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గిపోయినప్పటికీ, వెదుకులాడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి అంత సొమ్మైనా దొరుకుతుందన్న భావనలో చాలా మంది ఉంటారు. అదృష్టం కలసి వస్తే, ఒకేసారి లక్షాధికారులయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణా నది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుండటం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా జనం అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగు రాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని.. నిబంధనలు మీరి వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం
సాక్షి, కృష్ణాజిల్లా: కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తీరప్రాంతం పారిశ్రామిక, వర్తక, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల అభివృద్ధికి చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది. టీడీపీ పాలకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా పనుల్లో జాప్యం నెలకొంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం పోర్టు ద్వారా చెన్నై, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రవాణా మార్గం సులభతరం అవుతుంది. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమలకు రోడ్డు రవాణా మార్గం అందుబాటులోకి వస్తుంది. బాపట్ల, రేపల్లెతో పాటు కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా రూ.1150 కోట్ల ఎగుమతులు సాధిస్తున్న ఆక్వా రంగం మరింతగా పుంజుకుంటుంది. తగ్గనున్న 150 కి.మీ. దూరం తమ ప్రాంతం అభివృద్ధి కోసం జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ 2002లో కృష్ణా జిల్లా లోని పలు మండలాలకు చెందిన మత్స్యకారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నెలల తరబడి దీక్షలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే చెన్నై – కోల్‌కతా మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కోల్‌కతా, చెన్నై మధ్య రాకపోకలు సాగించే వాహనాలు ఏలూరు, విజయవాడ, గుంటూరు వెళ్లకుండానే నేరుగా ఒంగోలు చేరుకుంటాయి. ఫలితంగా ఇంధనం, సమయం ఆదా అవుతాయి. కోస్తా తీర ప్రగతికి రాచమార్గం 216 జాతీయ రహదారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం నుంచి పులిగడ్డ వరకు 120 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ రహదారిని నాలుగు వరసలుగా విస్తరిస్తున్నారు. 16 నంబరు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా ఒంగోలు నుంచి 216వ నంబరు జాతీయ రహదారి ప్రారంభమవుతుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ కత్తిపూడి వద్ద తిరిగి 16 నంబరు జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 260.5 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 30, కృష్ణాలో 138, గుంటూరులో 48, ప్రకాశంలో 123.48 హెక్టార్ల భూములు సేకరించారు. ఇందు కోసం నిర్వాసితులకు రూ.320 కోట్లు చెల్లించారు. పొడవైన వంతెనలు.. పెద్ద ఎత్తున కల్వర్టులు ప్రాజెక్టులో భాగంగా రైల్వే క్రాసింగ్ ఉన్న చోట్ల ఆరు ప్రాంతాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు నిర్మిస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, రావులపాలెం, పెడన, భట్టిప్రోలు, చినగంజాం వద్ద ఆర్వోబీలు నిర్మిస్తున్నారు. కాకినాడ వద్ద 19 కిలోమీటర్ల పొడవున బైపాస్ నిర్మించారు. గతంలో ఉన్న వంతెనల స్థానంలో 164 కొత్త వంతెనలను నిర్మిస్తున్నారు. ఈపూరుపాలెం – ఒంగోలు మధ్య 25, కత్తిపూడి – కాకినాడ మధ్య 23 వంతెనలు నిర్మిస్తున్నారు. 731 కల్వర్టులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో పెడన వద్ద ఇప్పటికే బైపాస్ ఉండగా, బంటుమిల్లి సమీపంలో మరో బైపాస్ నిర్మిస్తున్నారు. చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం వద్ద బైపాస్‌లు నిర్మిస్తున్నారు. ఏడు టోల్ ప్లాజాలు ఈ రహదారిపై ఏడు టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, అన్నంపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం, కృష్ణా జిల్లా బాసినపాడు, మోపిదేవి, గుంటూరు జిల్లా రెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటవు తాయని తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై సాధారణ వేగం 80, గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ రహదారిని ఒకే దిశలో మలుపులు లేకుండా డిజైన్ చేశారు. వంతెనల వద్ద అప్రోచ్‌రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఈ రహదారిని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద నిర్మాణంలో ఉన్న 216 జాతీయ రహదారి పెడన వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ -
దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి
-
టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం
-
పూర్తి స్థాయికి నీటిమట్టం; ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
-
విధిలేని పరిస్థితుల్లో 6 గేట్లు ఎత్తి నీరు వదిలాం: ఈఈ స్వరూప్
సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ స్వరూప్ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు. -
మూడో తరగతి విద్యార్థి దారుణ హత్య
చిన్నారిని చిదిమేశారు.. కర్కశంగా గొంతుకోసి చంపేశారు.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లికి గుండెకోతను మిగిల్చారు.. చల్లపల్లి బీసీ వసతి గృహంలో ఓ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన దివిసీమలో సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి గొంతు కోసి బాత్ రూమ్‌లో పడేశారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆదిత్యను చూసి తల్లి తల్లడిల్లిపోయారు. అయితే బాలుడి తండ్రి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తల్లి ఆరోపిస్తుండగా.. హాస్టల్లోని తోటి విద్యార్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, అవనిగడ్డ : బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాలు.. బాలుడు దాసరి ఆదిత్య(8) మూడో తరగతి చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు. ఉదయానే డాబా పైకి వెళ్లిన తోటి విద్యార్థులు ఆదిత్య విగతజీవిగా పడి ఉండడంతో భయాందోళన చెంది, వెంటనే కాపలాదారుడు నాగబాబుకు చెప్పటంతో అధికారులకు సమాచారం అందించారు. పంచాయతీ పరిధిలోని చల్లపల్లి నారాయణరావు నగర్లో నివాసం ఉంటున్న దాసరి రవీంద్ర, ఆదిలక్ష్మి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు అశోక్, రెండో కుమారుడు ఆదిత్య(8) స్థానిక బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. రవీంద్ర శుభకార్యాలకు మండపాలు డెకరేషన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హాస్టల్లోకి వెళ్లింది సోమవారమే.. ఆదివారం ఇంటికి వచ్చిన ఆదిత్యకు తల్లి కొత్తబట్టలు కొనిచ్చి సోమవారం ఉదయం హాస్టల్‌కు తీసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి పైఅంతస్తులో ఉన్న మరుగుదొడ్డిలో హత్యకు గురయ్యాడు. నిద్రలేపి చంపేశారా? ఆదిత్య హత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. తొలుత ఆదిత్య అన్నయ్య అశోక్‌ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నిద్రలేపి మూత్ర విసర్జనకు వెళ్లమని చెప్పాడు. నిద్రలో ఉన్న అశోక్ రావడం లేదని చెప్పి ప్రార్థన చేసి నిద్రపోయాడు. అనంతరం అదే వ్యక్తి ఆదిత్యను నిద్రలేపి వసతిగృహంపై అంతస్తులో ఉన్న బాత్రూంల వద్దకు తీసుకెళ్లి మెడకోసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మెట్ల కింద రక్తపు మరకలు.. బీసీ వసతి గృహంలోని పై అంతస్తు బాత్రూంలో దాసరి ఆదిత్య హత్యకు గురి కాగా గ్రౌండ్‌ఫ్లోర్ మెట్లు కింద రక్తపు మరకలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారం లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. వసతిగృహంలో గ్రౌండ్ ఫ్లోర్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, అర్ధరాత్రి పై అంతస్తులోని మరుగుదొడ్లుకు ఆదిత్య ఎందుకు వెళ్లాడనే ప్రశ్న తలెత్తుతోంది. తండ్రి సంబంధాలపై అనుమానాలు.. మృతుడి తండ్రి రవీంద్రకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తల్లి ఆదిలక్ష్మి ఆరోపించింది. ఈ విషయమై గతంలో రెండు కుటుంబాల మధ్య పలుమార్లు వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పెద్దలు రాజీ కుదర్చడం జరిగింది. ఏఎస్పీ సత్తిబాబు విచారణ తొలుత డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ ఎం.వెంకటనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఏఎస్పీ మోకా సత్తిబాబు çహత్య తీరును పరిశీలించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులు, వాచ్మెన్, ఇన్చార్జి వార్డెన్ని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. డాగ్‌స్క్యాడ్, క్లూస్‌టీంలు రంగంలో దిగి ఆధారాలు సేకరించాయి. బీసీ సంక్షేమశాఖ డీడీ ఐ.రమాభార్గవి బీసీ వసతిగృహానికి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీ ఓ పరిశీలన.. బాలుడి దారుణ హత్య విషయం తెలుసుకున్న మచిలీపట్నం ఆర్డీఓ జె.ఉదయభాస్కర్, తహసీల్దార్ కె.స్వర్ణమేరి హాస్టల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. సిబ్బందిని ఆరా తీశారు. శవ పంచనామా అనంతరం పోలీసులు బాలుడి తండ్రి రవీంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ తరలించారు. నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఆందోళన బాలుడిని కిరాతంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయనివ్వమని మృతుడి బంధువులు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్, వాచ్మన్ని సస్పెండ్ చేయాలని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఏఎస్పీ సత్తిబాబు మాట్లాడుతూ వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సాయపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆదిత్య మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా! దాసరి ఆదిత్య హత్య కేసులో పోలీసుల విచారణ భిన్న కోణాల్లో సాగుతోంది. హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడ్డడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన ఆయుధంతో మెడకోసి హత్య చేసినట్టు పోస్టుమార్టంలో తేలడంతో ధర్మాకోల్ కట్టర్(చిన్న పోల్టు చాకు)తో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ పదోతరగతి విద్యార్థ్ధి కొన్నిరోజులు కలసి పడుకున్నారు. ఆ విద్యార్థి వికృత చేష్టలకు భయపడి అతని దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ విద్యార్ధి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వార్డెన్, వాచ్‌మన్ సస్పెన్షన్జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అవనిగడ్డ: చల్లపల్లి బీసీ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసలి ఆదిత్య(8) హత్యకు గురైన నేపథ్యంలో ఇన్చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్ నాగబాబుని సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతుందని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
ఎన్నికల్లో అలసత్వం.. అధికారులపై వేటు
సాక్షి, నూజివీడు : ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంల భద్రత విషయంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్దిరోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా వీటికి ఎందుకు తరలించారనే దానిపై పైఅధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. -
రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు
కంకిపాడు/ఉయ్యూరు : చంద్రబాబూ...ఖబడ్దార్. రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉయ్యూరులోని మార్కెట్ సెంటరులో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర బహిరంగ సభలో పార్థసారథి ప్రసంగించారు. పేదవాడికి రేషన్‌కార్డు, పక్కా ఇల్లు, ఇంటి స్థలం, పింఛను ఏ ఒక్కటి ఇవ్వాలన్నా వాళ్ల బాబు సొమ్ము పోతున్నట్లు టీడీపీ ప్రభుత్వం బాధపడుతుందని మండిపడ్డారు. టీడీపీ తన పాలనలో ఉయ్యూరులో ఏ ఒక్కరికీ సెంటు భూమి ఇచ్చి, ఇల్లు కట్టించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు సేకరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆగ్రహం.... పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘జనాల కోసం డ్యాన్సులు వేయటం మాకు చేతకాదు.. ఉయ్యూరు సెంటరులో జనంతో చప్పుట్లు కొట్టించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డ్యాన్స్‌లు వేశారు... ప్రజలు కడుపుకాలి ఆకలితో బాధపడుతుంటే డ్యాన్సులు ఎవరైనా వేస్తారా?... ప్రజలు కష్టాలు తెలుసుకుని ఆకలి తీర్చేందుకు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు కాబట్టే వేలాదిగా జనం తరలివచ్చారన్నారు. ఈశ్వరయ్య లేఖపై నోరెత్తలేని దద్దమ్మ... జస్టిస్ ఈశ్వరయ్య బీసీలకు న్యాయమూర్తుల ఎంపికపై జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా లేఖ రాస్తే సమాధానం చెప్పలేని దద్దమ్మ చంద్రబాబు కాదా? అన్నారు. కేంద్రం ఈశ్వరయ్య వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే చంద్రబాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఒక్క రూపాయి కూడా పేదల నుంచి తీసుకోకుండా రూ.3 లక్షలతో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని, కాల్వ కట్ల వాసులకు పూర్తి భరోసా ఇవ్వాలని జగన్‌కు విజ్ఞప్తిచేశారు. -
138వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
-
ఏటీఎం చోరీకి విఫలయత్నం
విజయవాడ : గుర్తుతెలియని దుండగులు ఎటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం కష్ణా జిల్లా మండవెల్లి మండలం లింగాల గ్రామంలో ఉన్న ఎటీఎంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏటీఎం గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. ఎంతకీ ఏటీఎం తెరుచుకోక పోవడంతో దుండగులు పరారయ్యారు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (మండవెల్లి) -
నేనున్నాగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి
కార్యకర్తలను రెచ్చగొట్టిన టీడీపీ అభ్యర్థి వంశీ దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు హనుమాన్ జంక్షన్ నేను ఉన్నాగా.. కొట్టండి... చెప్పుతో కొట్టండి...’అంటూ కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ బాహాటంగానే పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గ పరిధిలోని కొత్త మల్లవల్లిలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేసిన ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నలుగురు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త మల్లవల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు గన్నవరంలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సభకు హాజరై ఆటోలో తిరిగివస్తున్నారు. వంశీ ప్రచారాన్ని గమనించి.. ఆ ఆటోను మరో మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వారిని దూషించారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రచార వాహనంపై ఉన్న వంశీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ... ‘నేనున్నానుగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఇదే అదనుగా వారు రాళ్లతో దాడి చేశారు.