సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఈఈ స్వరూప్ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment