Prakasam Barriage
-
ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు దిగువకు విడుదల
-
ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద ఉధృతి
-
ప్రకాశం బ్యారేజీ వద్ద గంట గంటకు పెరుగుతున్న వరద
-
విధిలేని పరిస్థితుల్లో 6 గేట్లు ఎత్తి నీరు వదిలాం: ఈఈ స్వరూప్
సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ స్వరూప్ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్‌కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీలో యువతి ఆత్మహత్య
-
ప్రకాశం బ్యారేజీ: 70 గేట్లు ఎత్తివేత
-
పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 70 గెట్లు ఎత్తి నీటి దిగువకు వదిలారు. ప్రకాశం బ్యారేజీలో నమోదు అయిన వరద ప్రవహం .. ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056 క్యూసెక్కులుగా ఉంది. 12 అడుగుల పూర్తీ స్థాయి నీటి మట్టంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా ఉన్నది. దీంతో అధికారలు బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈస్టర్న్ ,వెస్ట్రన్ కెనాల్స్ ద్వారా 10,356 క్యూసెక్కులు నీటి విడుదల చేశారు. నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతోంది. (పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద) లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరిక.. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాలైన రణదివినగర్, భూపేష్ గుప్తా నగర్, తారకరామనగర్, భవానీపురం, విద్యాధపురం మొదలగు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 0866-2424172 0866-2422515 -
పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద
సాక్షి, కృష్ణా జిల్లా: శ్రీశైలం వయా నాగార్జున సాగర్ మీదుగా పులిచింతలకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ వస్తోంది. అంచలంచెలుగా తన ఉధృతిని పెంచుకొంటూ ఉరకలేస్తోంది. అప్రమత్తమైన అధికారులు తొలుత ఆరుగేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్‌కి నీటిని విడుదల చేసారు. వరద ప్రవాహం పెరిగిపోవటంతో నీటి విడుదల శాతాన్ని అంచలంచెలుగా పెంచుతున్నారు. 17 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ నుంచి 3 ,50 ,000 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3,50,000 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. పులిచింతల పూర్తి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్ఢి ఆదేశాలతో పరిస్థితిని కలెక్టర్ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్పై సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసారు. ముంపుకు గురయ్యే ముక్త్యాల, రావెల, చందర్లపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ,పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత తహశీల్దార్లకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. -
బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకింది
-
కృష్ణా నదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం
-
కృష్ణానదిలో దూకిన మహిళ
సాక్షి, విజయవాడ: ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన గురువారం విజయవాడలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు... గజ ఈతగాళ్ల సాయంతో ఆమెను ప్రాణాలతో కాపాడారు. వివరాలు.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుమారుడిని అక్కడే వదిలేసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఈతగాళ్ల సాయంతో మహిళను రక్షించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆమెను స్వస్థలానికి తీసుకెళ్లారు.(కోడి కూర గొడవ.. రాళ్లతో కొట్టుకున్న ఇరు వర్గాలు) చదవండి: ‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ -
కృష్ణమ్మ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/తాడేపల్లి రూరల్: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. ప్రధాన ఉప నది తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో శ్రీశైలం జలాశయంలోకి గురువారం సాయంత్రం ఆరు గంటలకు 6.68 లక్షల క్యూసెక్కులు ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు 30 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పది గేట్లు 24 అడుగుల మేర ఎత్తి రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 5.95 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్‌లోకి 5.77 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ కాలువలకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, సాగర్ 26 గేట్లు ఎత్తి 5.87 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 6.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఇక్కడకు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దానిని నియంత్రిస్తూ నదీ తీర ప్రాంత ప్రజలను ముంపు బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా.. ప్రకాశం బ్యారేజీలోకి 4.80 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగురవేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5.12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రికి ఆరు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం 5.66 లక్షలకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మొత్తం మీద ఈ సీజన్లో గురువారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 604.68 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ప్రమాదకరంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు.. బ్యారేజికి గత 75 రోజుల నుంచి తరచూ వరదలు వస్తుండడంతో గేట్లలో లోపాలు బయటపడుతున్నాయి. గురువారం 5లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద రావడంతో సీతానగరం వైపు ఉన్న అండర్ స్లూయిస్ గేట్ల మీద నుంచి నీళ్లు పొర్లాయి. ఈ ఒత్తిడికి అండర్ స్లూయిస్ గేట్లలో 7వ గేటు వద్ద చెయిన్ లింక్ తప్పి నీళ్లలో వేలాడుతోంది. -
‘విజయ’ కాంతులు!
సాక్షి, విజయవాడ : పావన కృష్ణాతీరం విద్యుత్ కాంతులీనుతోంది. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవడం.. కృష్ణమ్మ పరవళ్లతో ఈ ప్రాంతంలో పచ్చదనం పరిఢవిల్లడంతోపాటు సాయంత్రం వేళ విజయవాడ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. తాడేపల్లి నుంచి ఓమారు ఈ ‘వాడ’ను చూస్తే ఇంద్రలోకం ఇక్కడ కొలువైందన్న భావన కలుగుతోంది. అటు దుర్గమ్మ కొండ, ఇటు కాళేశ్వరరావ్ మార్కెట్ పరిసరాలు, పద్మావతీ ఘాట్.. ఇలా ఒకటేమిటీ కృష్ణాజలాల్లో సాయంత్రం వేళ ఆయా ప్రతిబింబాలు విద్యుత్ కాంతులతో మెరసిపోతున్నాయి. అలా మెరుస్తున్న విజయవాటికను ‘సాక్షి’ కెమెరాలో క్లిక్‌మనిపించింది. కష్టం.. వర్ణనాతీతం మగువల అందాలను ద్విగుణీకృతం చేసే రంగు రంగుల చీరల వెనుక కార్మికుల కాయాకష్టం అపారం. శ్వేతవర్ణంలోని నూలును వేడి నీళ్లలో ఉడకబెట్టి, రంగుల తొట్టెల్లో ముంచి నానబెట్టి, వాటిని పిండి ఆరబెట్టి కట్టల రూపంలో కట్టి అమ్ముతారు. నూలు కండెలను రంగుల్లో ముంచి ఇనుప కడ్డీలు ఉపయోగించి పిండేటప్పుడు తమ బలమంతా ఉపయోగిస్తారు. ఎప్పుడైనా పట్టుతప్పితే ఇనుప కడ్డీలతో ప్రమాదం పొంచి ఉంటుంది. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండా.. కనీసం ఒంటిమీద బట్టలు కూడా సరిగా లేకుండా, తువాలు చుట్టకుని ఎర్రటిఎండలో తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పొట్టకూటికోసం వారు పడుతున్న కష్టం వర్ణనాతీతం. గత 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటున్న వారిని చూస్తే రంగుల దారాల వెనుకున్న కష్టం తెలుస్తోంది. మంగళగిరి సమీపంలో కనిపించిన కార్మికుల చిత్రాలను దృశ్యాలను ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. చక్కగా... చిక్కగా...! కృష్ణమ్మ పరవళ్లు మత్స్యకారులకే కాదు.. జీవరాశులకు కూడా కడుపునింపుతున్నాయి. గంటలకొద్దీ చెరువుల్లో ఒంటికాలివీుద నిలబడి చేపలు దొరికే వరకు ఎదురుచూడాల్సిన అగత్యం లేకుండానే ప్రకాశం బ్యారేజీ చెంత నీటికొంగలకు చేపలు ఇట్టే చిక్కిపోతున్నాయి. నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న వీటిని కొంగలు అలవొకగా నొట చిక్కించుకుని కడుపులో వేసుకుంటున్నాయి!. శనివారం మధ్యాహ్నం బ్యారేజ్‌లో వద్ద ఎదురైన ఈ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
‘అందుకే చేతులు పైకెత్తి అరిచాను’
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ పైనుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన సింహాద్రి అనే వ్యక్తిని పోలీసులు కాపాడారు. దీంతో అతడు క్షేమంగా బయటపడ్డాడు. అనంతరం సింహాద్రి మాట్లాడుతూ.. ఇంటి యజమాని వేధింపులు భరించలేక నదిలోకి దూకి చనిపోదామనుకున్నట్లు తెలిపాడు. అయితే నీళ్లలో కొట్టుకుపోతున్న సమయంలో తన కాళ్లకు ఇసుక దిబ్బలు తగిలాయని.. దాంతో దుర్గమ్మ బతకాలని చెప్పినట్టు భావించానని పేర్కొన్నాడు. అందుకే చేతులు పైకెత్తి అరిచానని.. ఈ క్రమంలో తన కేకలు విన్న పోలీసులు బోటులో వచ్చి రక్షించారని వెల్లడించాడు. -
వరద నీటిలో చంద్రబాబు హెలీప్యాడ్
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. కృష్ణానదీ తీరానా ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ కట్టడ నివాసం వద్ద పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీంతో నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. రివర్ ఫ్రంట్ వ్యూ భవనం, వాక్‌వే ఇప్పటికే నీట మునిగాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శనివారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. చంద్రబాబు నివాసంలోని పంటపొల్లలోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు హై సెక్యూరిటీ జోన్‌లోని తన ఇంటిపై డ్రోన్లతో నిఘా వేశారంటూ చంద్రబాబు ట్వీట్లపై ట్వీట్లు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నది గర్భంలో, కరకట్టపై నిర్మించిన అక్రమ భవనాల్లోకి ప్రవహాం కొనసాగుతోంది. ఇదిలావుండగా.. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. -
పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ
సాక్షి, విజయవాడ : నాగార్జున సాగర్ నుంచి భారీ ఎత్తున నీరు చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. వరద ఉదృతి పెరిగేకొద్దీ నీటి విడుదల శాతాన్ని కూడా అధికారులు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి వరకు ఐదు లక్షలకు పైగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజీకి జలకళ రావడం, మొత్తం 72 గేట్లు ఎత్తేయడంతో సందర్శకుల తాకిడీ పెరుగుతోంది. మరోపక్క చందర్లంపాడులో వరద నీటిలో గొర్రెల కాపర్లు చిక్కుకోవడంతో వారిని రెస్క్యూ టీం కాపాడుతున్నారు. -
అబ్బ.. చంద్రబాబు ఏం చెప్పితిరి...
సాక్షి, అమరావతి : గతంలో జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చుకుని అభాసుపాలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా తనను తాను టంగుటూరు ప్రకాశం పంతులుతో పోల్చుకున్నారు. వైకుంఠపురం బ్యారేజ్ శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ఈ పోలిక తెచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నేనే. ఆయన ప్రకాశం బ్యారేజీ కడితే నేను వైకుంఠపురం బ్యారేజ్‌కు శ్రీకారం చుట్టా. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌కి 13.2.1954లో శంకుస్థాపన చేస్తే, నేను వైకుంఠపురం బ్యారేజ్‌కి 13.2.2019లో శంకుస్థాపన చేశా. ప్రకాశం పంతులు శంకుస్థాపన చేసిన రోజే నేను కూడా శంకుస్థాపన చేశా. ఆయన ప్రకాశం బ్యారేజ్‌ని అత్యంత వేగంగా పూర్తి చేశారు. అలాగే నేను కూడా అంతకంటే వేగంగా ఈ బ్యారేజ్‌ని పూర్తి చేస్తా’ అని బాబుగారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హ్యాపీ సిటీస్ సమ్మిట్‌లో చంద్రబాబు తన హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటూ మళ్లీ పాత రికార్డే వేశారు. ‘గతంలో హైదరాబాద్‌ను నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేశానని, 164 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మించామని, హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు సైబరాబాద్‌ను నిర్మించానని చెప్పారు. అమరావతి అంటే దేవతల రాజధాని. ఇక్కడ నివసించే వారు సుదీర్ఘ జీవితాన్ని పొందాలి. అన్ని వసతులతో పాటు నాణ్యమైన జీవనం వారికి అందించాలి. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో అత్యుత్తమ నగరాన్ని అమరావతిలో నిర్మిస్తున్నాం. రైతులకు కూడా వివరించాను. వ్యవసాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాను. రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా 34వేల ఎకరాలను సంతోషంగా అమరావతికి ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. కృష్ణానదిపై మూడు బ్యారేజ్‌లు ఉంటాయి. చౌడవరం, వైకుంఠపురం, ప్రకాశం బ్యారేజ్‌లు. 120 కిలోమీటర్ల మేర స్వచ్ఛ జలాలను అందిస్తాయి. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నాం. చాలా కన్సల్టెన్సీలు నగర నిర్మాణంలో సేవలు అందిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ సిటీల వల్ల ఉపయోగం లేదు. దానికి భిన్నంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నాం. అత్యుత్తమ విద్యాసంస్థలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు తీసుకువస్తున్నాం. 2020 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా వుంటుంది’ అని చంద్రబాబు అన్నారు. -
నిండు కుండలా ప్రకాశం బ్యారేజ్
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలాగా మారింది. పై నుంచి వచ్చి చేరే వరద నీటితో ప్రకాశం బ్యారేజ్ వద్ద గరిష్ట స్థాయికి చేరిం ది. దీంతో సోమవారం రాత్రి ప్రకాశం బ్యారేజ్ నుంచి క్రిందకు వరద నీటిని విడుదల చేయనున్నారు. వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కాల్వలకు నీరు బంద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు ఉండటంతో ఇప్పటికే అనేక పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ దశలో కాల్వలకు నీరు వదిలితే కాల్వల కట్టలు తెగిపోతాయని ఉద్దేశ్యంతో కాల్వలకునీరు వదిలి వేయడం నిలిపివేశారు. 2,175 క్యూసెక్కులు సముద్రంలోకి! కృష్ణానదిలో నీటి మట్టం గరిష్టంగా 12 అడుగులకు చేరింది. అప్పటికీపై నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో మూడు గేట్ల ను ఒక అడుగు ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 5 నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలా లని అధికారులు భావించారు. అయితే పై నుంచి వచ్చే వరద నీటి ఉధృతిని బట్టి మంగళవారం ఉదయం గేట్లు సంఖ్య పెంచవచ్చని భావించిన తొలుత 3 గేట్లు మాత్రమే పైకి తీసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నందున నదీ తీరప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. విజయవాడ, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, తహసీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు నదిపరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించారు. నదిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా పెథాయ్ తుఫాను తీరం దాటడంతో మంగళవారం వర్షాలు తగ్గుతగ్గి వాతావరణం మార్పులు వస్తాయని భావిస్తున్నారు. -
టీడీపీ కార్యాలయమైనా, ప్రకాశం బ్యారేజ్ పైనా రెడీ
-
సవాల్ విసిరి..తోక ముడిచిన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ సీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన టీడీపీ నేతలు తోక ముడిచారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అరాచకాలను వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన సవాల్‌ను స్వీకరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో 3 గంటల పాటు ఎదురుచూసినప్పటికి అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోయారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు అవినీతిని ఎప్పుడైనా, ఎక్కడైనా సాక్ష్యాధారలతో ఎండగడతామని చెప్పారు. టీడీపీ కార్యాలయమైనా, ప్రకాశం బ్యారేజ్ పైనా అయిన వస్తామని అందుకోసం ఏడాది పాటు సమయం ఇస్తున్నామని టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. ‘చర్చించే దమ్ములేక టీడీపీ నేత వర్ల రామయ్య చర్చకు రాలేకపోయారు. మేము అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు టీడీపీ నేతలకు టైం ఇస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ అయినా సరే.. టీడీపీ కార్యాలయం అయినా చర్చకు మేం రెడీ. మరోసారి వైఎస్ జగన్‌ను విమర్శిస్తే ఊరుకోం.’ అని హెచ్చరించారు. కాగా అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని వర్ల రామయ్య సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రకాశం బ్యారేజీకి అరవై వసంతాలు
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం బ్యారేజీ నిర్మించి ఆరవై సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకొని అసువులు బాసిన వారందరికి నివాళి అర్పించారు. బ్యారేజీ నిర్మాణంలో పాలు పంచుకుని వృద్ధులైన ఇంజనీర్లను సత్కరించారు. అప్పట్లో కర్నూలుకు బదులు రాజధాని ఇక్కడ వచ్చి ఉంటే రాష్ట్రం బ్రహ్మాడంగా ఉండేదని, తెలుగు వాళ్లు అందరూ కలిసి ఉండాలనే ఉద్ధేశ్యంతో పెద్దలందరూ కలిసి హైదరాబాద్‌ని రాజధాని చేశారన్నారు. పట్టిసీమను సంవత్సరం లోపు పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని చెప్పారు. -
ఈత చైతన్యం..!
అది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్. ఓ వ్యక్తి చేతులను కాళ్లను తాళ్లతో కట్టేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అతడిని మోసుకెళ్లి కృష్ణానది ఒడ్డున వదిలారు. ఆ వ్యక్తి మెల్లగా దేహాన్ని కదిలిస్తూ నీటిపై తేలుతున్నాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఓ గజ ఈత గాడు సాహసం చేస్తున్నాడు. చేతులు, కాళ్లను కట్టేసుకుని నీటిలో ఈదుతున్నాడు. ఏకంగా ఆరుకిలోమీటర్ల దూరం ఈత కొట్టాడతడు. అతడే 43 ఏళ్ల లంకె ఉమామహేశ్వర రావు. ఇదంతా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధనలో భాగం. ఈతలో విన్యాసాలు చేసే గజ ఈతగాడు లంకె ఉమామహేశ్వరరావు వృత్తిరీత్యా పోలీసు. ఆయనది గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలోని ఓలేరు గ్రామం. మనిషికి దైనందిన జీవితంలో ప్రకృతి నుంచి ఎదురయ్యే గండాలనేకం. వాయుగండం, అగ్నిగండం, జలగండం... వంటివన్నీ తప్పించుకుంటూనే ప్రకృతితో మమేకమై జీవించాలి. అదే ఆయనకు తెలిసిన ఫిలాసఫీ. ఈత నేర్చుకుంటే జలగండం నుంచి తప్పించుకోవడంతోపాటు ఇతరులనూ రక్షించవచ్చంటారు. ఈతలో విన్యాసాలు చేస్తూ ఈత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ విన్యాసాలు చేయడానికి కృష్ణాతీరమే కారణం అంటారాయన. ‘‘మా ఓలేరు గ్రామం కృష్ణానది తీరాన ఉన్న లంక గ్రామం. అరటి, సపోటా, మామిడి తోటలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. గ్రామాల్లో పుట్టి పెరిగిన పిల్లలకు ఈత నేర్పడానికి శిక్షకులు ఉండరు. మక్కువ ఉంటే ప్రకృతే నేర్పిస్తుంది. ఏరు నీటితో నిండుగా ఉంటే ఈదాలనే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఐదో తరగతి చదివేనాటికే స్నేహితులతో కలిసి ఏటిలో అరటి బొండు మీద పడుకుని ఈత నేర్చుకున్నాను. ప్రతి మనిషీ... నీరు తాగడం ఎంత తప్పని సరో నీటిలో తేలడం కూడా అంతే తప్పని సరి - అని తెలుసుకోవాలి. ఈత నేర్చుకుంటే ఎంతటి మహాప్రళయం సంభవించినా ప్రాణాలను కాపాడుకోవచ్చు’’ అంటారు ఉమామహేశ్వరరావు. ఈత పతకాల కోసం కాదు! జీవితం మీద విరక్తితో క్షణికావేశంలో ఆత్మహత్యాప్రయత్నం చేసేవారు ఎందరో. వారిలో చాలామంది నీటిలో దూకిన తర్వాత బతకాలనే తపనతో కొట్టుమిట్టాడుతారు. ఈత వచ్చి ఉంటే వారంతా బతికి బయటపడేవారే. అలాగే ఈత వచ్చి ఉంటే ప్రకృతి వైపరీత్యాల్లో అనేకమంది ప్రాణాలతో ఒడ్డుకు చేరతారు. ప్రకృతి మనకు ప్రకృతితో కలిసి జీవించడమూ నేర్పిస్తుంది. ప్రకోపించినప్పుడూ రక్షించుకోవడమూ నేర్పిస్తుంది. ఈత నేర్చుకోవడం పతకాల కోసం కాదు, ఆత్మరక్షణ కోసమేనంటారు ఉమామహేశ్వరరావు. ఆత్మరక్షణ విషయంలో ఎక్కువమందిని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యం అంటారాయన. ఆ క్రమంలోనే ఆయన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న హంసలదీవి వరకు ఈతకొట్టారు. ఆ తర్వాత గిన్నిస్‌రికార్డు సాధించడం పెద్ద కష్టమేమీ కాదనిపించడంతో ఇప్పుడా ప్రయత్నంలో ఉన్నారు. ‘‘నేను ప్రస్తుతం విజయవాడలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. గిన్నిస్ రికార్డు కోసం నా ప్రయత్నానికి మా డిపార్ట్మెంట్ డిఐజి సహకరిస్తున్నారు’’ అన్నారాయన. ఈ తరాన్ని చూస్తూ బాధతో... పోలీసు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం వచ్చి ఐదు కిలోమీటర్ల దూరం పరుగెత్తలేక కుప్పకూలిపోవడాన్ని చూస్తే గుండె ద్రవించిపోతోందంటారు ఉమామహేశ్వరరావు. కాన్వెంట్స్కూళ్ల చదువు, తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో పెంచుతూ దేహానికి వ్యాయామం లేకుండా పెంచడమే ఇందుకు కారణం. ఈ తరం యువత తాము ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడిపోతే ఈదుకుంటూ ఒడ్డుకు చేరలేని నిస్సహాయ స్థితిలో ఉందని వాపోయారు. ‘‘విజయవాడలో ముగ్గురు కాలేజీ విద్యార్థినులు అనుమానాస్పదంగా కృష్ణానదిలో మునిగి చనిపోయారు. వారికే కనుక ఈత వచ్చి ఉంటే ఏదో ఒక దశలో బతికి బయటపడేవాళ్లు. ఇలాంటివి చూసిన తర్వాత ఈత పట్ల చైతన్యం తీసుకురావాల్సి అవసరం చాలా ఉంది అనిపించింది’’ అన్నారు. విన్యాసమైనా... సాహసమైనా కఠోర సాధనతోనే! ఉమామహేశ్వరరావు చేస్తున్న విన్యాసాలు చూసి స్ఫూర్తిపొందుతున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. అయితే వారందరినీ ఆయన ‘‘ఈ విన్యాసం ఎంతో కష్టమైంది. కఠోర సాధన చేస్తే తప్ప సాధ్యం కాదు. ఎవరు పడితే వారు చేయడానికి వీల్లేదు. దేహదారుఢ్యం బాగుండాలి’’ అని హెచ్చరిస్తున్నారాయన. పోలీసు ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లమయం. అవి చాలవన్నట్లు ఈ విన్యాసాలు చేస్తూ ఎప్పుడూ ప్రమాదం అంచున గడపడం గురించి చెబుతూ... ఈ విషయంలో భార్య చంద్రకళ సహకారం చాలా గొప్పదంటారు ఉమామహేశ్వరరావు. ‘‘ఆవిడ నా విన్యాసాలకు సంతోషించడమే కాదు, నా లక్ష్యాన్ని గౌరవిస్తూ మా పిల్లలకు ఈతనేర్పించింది. మా దివ్య ఇంటర్ సెకండియర్. అబ్బాయి శ్రీరామ్ పదో తరగతి చదువుతున్నాడు. అబ్బాయి కృష్ణానదిలో ఆగకుండా ఐదుకిలోమీటర్లు ఈదుతాడు’’ అన్నారాయన సంతోషంగా. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇవ్వడానికి, మెళకువలు నేర్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. - రాజ్‌కుమార్ ఆలూరి, విజయవాడ,ఫొటోలు : పి.ఎల్. మోహన్ ఆత్మరక్షణ నేర్పించాలి! పిల్లలకు మంచి తిండి, చదువుతో పాటు ఈత కూడా నేర్పించాలి. రోజుకు ఒక గంట చొప్పున కేవలం వారం రోజుల కేటాయిస్తే చాలు ఈత నేర్చుకోవచ్చు. ఈత నేర్పిస్తే దేహదారుఢ్యంతోపాటు వారికి ఆత్మరక్షణ విద్య నేర్పించినట్లువుతుంది. ఈత వస్తే ఆపదలో ఉన్నప్పుడు తనతో పాటు మరో ఇద్దర్ని రక్షించే నైపుణ్యం సాధించవచ్చు. అంతకంటే ముందుగా ప్రమాదానికి లోనయిన వెంటనే భయపడకుండా బయటపడడం ఎలా అనే ఆలోచన కలుగుతుంది. - లంకె ఉమామహేశ్వరరావు, గజ ఈతగాడు ఈ మెయిల్: lanke.uma@gmail.com -
చిక్కిన ‘కృష్ణమ్మ’
* ప్రకాశం బ్యారేజి వద్ద 10.5కు చేరిన నీటిమట్టం * పదేళ్లతో పోలిస్తే ఇదే గణనీయమైన తగ్గుదల తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది నీటి మట్టం గణనీయంగా తగ్గింది. గత పదేళ్లతో పోల్చి చూస్తే ఈ స్థాయిలో తగ్గటం ఇదే తొలిసారి. ఎగువ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నీరు రాకపోవడమే దీనికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు, వంకలు కలిసే ప్రదేశాల్లో వర్షాలు పడకపోవడం వల్ల బ్యారేజి నీటి మట్టం 10.5కు చేరింది. దీంతో వీటీపీఎస్ ప్లాంట్‌కు నీరు అందడం లేదు. మరో రెండు రోజులు ఇలానే కొనసాగితే వీటీపీఎస్‌కు నీరు అందక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. దీనిపై బ్యారేజి డీఈ వెంకట్‌కుమార్ మాట్లాడుతూ... * పకాశం బ్యారేజి వద్ద 10.5 అడుగుల నీరు మాత్రమే ఉంది, దీని నుంచి తూర్పు కాలువకు 1600 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 740 క్యూసెక్కుల నీటిని ఇవ్వడంతోపాటు, గుంటూరు తాగునీటి అవసరాల నిమిత్తం మరో 60 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నాం. వీటీపీఎస్‌కు మోటార్ల ద్వారా నీటిని తీసుకుంటున్నారు. * నాగార్జునసాగర్ వద్ద నాలుగు రోజుల క్రితమే నీటిని కిందకు వదిలారు, రానున్న రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజి వద్దకు ఆ నీరు చేరుతుంది.